ఆనం వివేకానంద‌రెడ్డి క‌న్నుమూత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 15:17:03

ఆనం వివేకానంద‌రెడ్డి క‌న్నుమూత

త‌న హావ భావాల‌తో ప్ర‌త్య‌ర్దుల‌ను కూడా న‌వ్వించి త‌న చ‌లోక్తుల‌తో ప్ర‌జ‌ల‌ను న‌వ్వించ‌డం ఆయ‌న‌కు తెలుసు... రాజ‌కీయంగా సినిమాటిక్ గా త‌న పంచ్ లు న‌వ్వులు పువ్వులు పూయించేవి.. ఆయ‌న  నెల్లూరు జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు... కాంగ్రెస్ లో చ‌క్రం తిప్పిన కుటుంబానికి చెందిన నాయ‌కుడు... ఆయ‌నే  మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద‌రెడ్డి.
 
కొద్దిరోజులుగా అనారోగ్యంతో హైద‌రాబాద్ లో  కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆనం వివేకానంద‌రెడ్డి ఈరోజు ఉద‌యం క‌న్నుమూశారు..  ఆయ‌న‌కు 67 సంవ‌త్స‌రాలు..1950 డిసెంబర్ 25న ఆయ‌న జ‌న్మించారు..ఆనం వివేకాకు ఇద్ద‌రు కుమారులు.. ఆనం సోద‌రుడు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఆర్ధిక మంత్రిగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చేశారు..
 
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌లో రేడియేషన్ చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు..1999-2004-2009 లో ఎమ్మెల్యేగా ఆయ‌న ప‌నిచేశారు.. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ దారుణంగా ప‌రాజ‌యం పాల‌వ‌డంతో ఆయ‌న సోరుడితో తెలుగుదేశంలో చేరారు ఆనం.. ఇక గ‌త ఏడాది నుంచి ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.