బాబుకు జలక్ ఇచ్చిన టీడీపీ నేత...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-15 10:42:20

బాబుకు జలక్ ఇచ్చిన టీడీపీ నేత...

టీడీపీ క్రమ శిక్షణకు మారుపేరు అంటారు తెలుగు తమ్ముళ్లు...బాబు ఏది చెప్తే అదే ఫైనల్...ఎంతటి సీనియర్ అయినా అయన మాట వినాల్సిందే అంటారు...కానీ బాబుకి వయసు పెరిగేకొద్దీ టీడీపీలో క్రమశిక్షణ తగ్గిపోతుంది. ఈ నాలుగేళ్ళ కాలంలో ఎంతో మంది ఆశావాహులు ఎప్పుడు లేని విధంగా బహిరంగంగానే విమర్శించారు...వాళ్ళైతే కేవలం విమర్శించారు కానీ టీడీపీకి చెందిన సీనియర్ నేత మాత్రం బాబు వస్తానంటే వద్దు, ఫోన్ చేసిన మాట్లాడాల్సిన అవసరంలేదని బాబుకు ఝలక్ ఇచ్చారు..
 
ఇంతకీ ఎవరా సీనియర్ నేత అనుకుంటున్నారా ఆయనే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి..సీనియర్ నాయకులుగా నెల్లూరు రాజకీయాలను శాసించారు  ఆనం బ్రదర్స్...ఆనం వివేకానంద రెడ్డి ఆరోగ్యం బాగాలేకపోవడంతో కొద్దీ రోజుల క్రితం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు..హాస్పిటల్ లో ఉన్న ఆనం వివేకానంద రెడ్డిని పరామర్శించేందుకు చంద్రబాబు అక్కడకు వెళ్లారు, అప్పుడు ఈ ఘటన జరిగింది. 
 
చంద్రబాబు ఆనంని పరామర్శించేందుకు వస్తున్నారని ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఆనం రామనారాయణరెడ్డికి తెలియజేయగా, ఆయన ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పారని సమాచారం. అయినా చంద్రబాబు హాస్పిటల్ కి రావడంతో, చంద్రబాబు ముఖం కూడా చూడ్డానికి ఇష్టపడని ఆనం మరియు ఆనం కుటుంబ సభ్యులు బయటకి వెళ్లిపోయారు...దింతో అక్కడే ఉన్న సిబ్బంది ఆనం రామనారాయణరెడ్డికి ఫోన్ చేయగా...నీతో మాట్లాడాల్సిన అవసరం లేదని, ఇంకా మాట్లాడటానికి ఏమి లేదని సిబ్బందికి చెప్పారట...
    
ఈ మధ్యకాలంలోనే ఆనం బ్రదర్స్ టీడీపీ గూటికి చేరారు..టీడీపీ గూటికి అయితే చేరారు కానీ, వాళ్లకు అక్కడ సముచిత స్థానం టీడీపీ కల్పించకపోవడంతో అధినేతపైనా గుర్రుగా ఉన్నారు...అందుకే చంద్రబాబు ముఖం కూడా చూడటానికి అయన ఇష్టపడలేదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.. ఆనం త్వరలో తన అనుచరులతో సమావేశమై పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.