గవర్నర్ గా ఆనంది బెన్ పటేల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 12:40:56

గవర్నర్ గా ఆనంది బెన్ పటేల్

ఆనంది బెన్ ప‌టేల్ ప్ర‌ధానిగా న‌రేంద్ర‌మోదీ దేశీయ రాజ‌కీయాల‌కు వ‌చ్చిన స‌మ‌యంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఆమె ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టారు.. న‌రేంద్ర‌మోదీ ఆశీస్సుల‌తో ఆమెకు సీఎం ప‌ద‌వి వ‌రించింది అని గుజ‌రాత్ కాషాయ ద‌ళం ప్ర‌చారం కూడా చేసింది.

మాజీ ముఖ్య‌మంత్రిగా ఉన్న ఆనంది బెన్ ప‌టేల్ మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మితుల‌య్యారు.. బీజేపీ ఇక్క‌డ మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో రూలింగ్ లో ఉంది... ఆమెను గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించినట్టు రాష్ట్రపతి భవన్‌ ట్విట్టర్‌లో తెలిపింది.. ఆనంది బెన్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది.

అయితే రేండేళ్ల పాటు ఆమె సీఎం ప‌ద‌విలో కొన‌సాగారు.. ఇక పటీదార్‌ రిజర్వేషన్ల ఆందోళన, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వల్ల ఆమె సీఎం కుర్చీలో రేండేళ్ల‌కే దిగిపోయారు.. త‌ర్వాత గుజ‌రాత్ సీఎంగా విజ‌య్ రూపానీ భాధ్య‌త‌లు చేపట్టారు.. అంతేకాక ఇటీవ‌ల జ‌రిగిన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి విజ‌యం చేకూర్చారు.. దీంతో మోదీ మ‌ళ్లీ ఆయ‌న‌కే గుజ‌రాత్ పగ్గాలు అప్ప‌గించారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ గా ఓం ప్రకాశ్‌ కోహ్లి వ్యవహరిస్తున్నారు. 2016 నుంచి గుజరాత్‌ బాధ్యతలు అదనంగా చూస్తున్నారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఆనంది బెన్‌ బాధ్యతలు చేపడితే.. గుజరాత్‌ పూర్తిస్థాయి గవర్నర్‌గా కోహ్లి కొనసాగుతారని అధికారులు తెలియ‌చేస్తున్నారు. ఇక ఏపీకి కూడా త్వ‌ర‌లో కొత్త గ‌వ‌ర్న‌ర్ రానున్నార‌ని ఏపీలో వార్త‌లు వ‌స్తున్నాయి.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.