వైసీపీలో కొత్త నియామ‌కాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-05-02 12:55:57

వైసీపీలో కొత్త నియామ‌కాలు

కృష్ణా జిల్లాలో పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి అశేష జ‌న‌వాహినితో విశేష‌మైన మ‌ద్ద‌తు వ‌స్తోంది.. పార్టీలోకి వ‌ల‌స‌లు కూడా కృష్ణాలో మ‌రింత పెరిగాయి అనే చెప్పాలి... ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర మ‌రికొద్ది రోజుల్లో ప్ర‌వేశించ‌నుంది, ఇప్ప‌టికే కృష్ణాకు చివ‌ర‌న ప‌శ్చిమ‌కు ఎంట్ర‌న్స్ లోఉన్న ప్రాంతాల నాయ‌కులు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు.
 
   ఇక ఇప్ప‌టికే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  సోష‌ల్ మీడియా విభాగంలో పార్ల‌మెంట్ సెగ్మెంట్ల‌కు ఇంచార్జ్  ల‌ను నియ‌మించింది వైసీపీ నాయ‌కత్వం.. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ కొత్త నియామ‌కాలు చేశారు అనంత‌పురం జిల్లాలో.... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు, అనంతపురం అర్భన్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా అనంతవెంకట్రామిరెడ్డిని, హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా నదీంఅహ్మద్‌ను, అలాగే అనంతపురం పార్లమెంటు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా తలారి రంగయ్యను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
 
మొత్తం అనంత‌పురం నియామ‌కాల‌ను జ‌గ‌న్ పూర్తి చేశారు... ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మ‌రింత విజ‌యం దిశ‌గా పార్టీ దూసుకు వెళ్లేలా  నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు...గత  ఎన్నిక‌ల్లో ముఖ్యంగా అనంతపురం  రెండు ఎంపీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది...  అయితే ఇటీవ‌ల వ‌చ్చిన తెలుగుదేశం స‌ర్వే ఆస్ధాన మీడియా స‌ర్వే కూడా జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు మాత్ర‌మే తెలుగుదేశం గెలుచుకుంటుంది అని తెలిపింది... ఇక్క‌డ వైసీపీ మ‌రింత పుంజుకుంటోంది అనేది ఆ స‌ర్వే తేల్చింది... ఇది వైసీపీకి మ‌రింత మైలేజ్ ఇచ్చే అంశంగా ఉంది.. ఇక జిల్లా పై జ‌గ‌న్ మ‌రింత ఫోక‌స్ చేశారు అని వైసీపీ నాయ‌క‌లు జిల్లా నాయ‌కులు అంటున్నా

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.