చంద్ర‌బాబుకు చీర గాజులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 18:34:20

చంద్ర‌బాబుకు చీర గాజులు

టీడీపీ కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు,  వినుత్న‌నిర‌స‌న‌లు తెలుపుతున్నారు మ‌హిళ‌లు..  ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేయ‌కుండా త‌ప్పించుకుంటూ విదేశాలకు పారిపోతున్నార‌ని వైసీపీ మ‌హిళా విభాగం మండిప‌డుతోంది... నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్రత్యేక హోదా కోసం ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నార‌ని వారు తెలియ‌చేశారు.
 
వైసీపీకి మ‌ద్ద‌తు  తెలుపుతూ ఈ రోజు అనంత‌పురం ట‌వ‌ర్ క్లాక్ వ‌ద్ద నుంచి ప్ర‌ధాన త‌పాలా కార్యాలయం వ‌ర‌కూ పెద్దఎత్తున మ‌హిళా సంఘాలు ర్యాలీని చేప‌ట్టాయి...  కృష్ణవేణి ఆధ్వర్యంలో చేప‌ట్టిన ఈ ర్యాలీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చీర, గాజులు, ప‌సుపు, కుంకుమ అన్ని ఓ బాక్స్ లో ప్యాక్ చేసి వాటిని  అమ‌రావ‌తిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు పంపించారు.
 
ఈ ర్యాలీలో భాగంగా కృష్ణ‌వేణి మాట్లాడుతూ... చంద్ర‌బాబు వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్యాయంగా బ‌లైపోతోంద‌ని, దానిని ర‌క్షించుకునే బాధ్య‌త మ‌నంద‌రి పై ఉంద‌ని అన్నారు.. రాష్ట్రానికి హోదా రాకుండా చేసింది ముఖ్య‌మంత్రి అని ఆమె తెలిపారు.. అయితే ఈ ర్యాలీ ద్వారా అయినా చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం చేస్తార‌ని  అందుకోస‌మే ఆయ‌న‌కు చీర, కుంకుమ, ప‌సుపు గాజులు పంపుతున్నామ‌ని మ‌హిళా సంఘాల ప్ర‌తినిధులు తెలియ‌చేశారు.
 
చూడాలి మ‌రి మ‌హిళ‌లు పంపిన ఈ వ‌స్తువుల‌ను నిర‌సిస్తూ చంద్ర‌బాబు త‌మ ఎంపీల‌తో రాజీనామా చేయించి ప్ర‌త్యేక హోదా ఉద్యమం చేస్తారా అనేది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.