జేసి దివాక‌ర్ రెడ్డికి బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

diwakar reddy image
Updated:  2018-03-05 01:53:51

జేసి దివాక‌ర్ రెడ్డికి బిగ్ షాక్

గ‌త కొద్ది రోజులుగా తెలుగు దేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కుల నుంచి అడ్డంకులు త‌లెత్తుతూనే ఉన్నాయి... దీంతో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో వీట‌న్నింటిని ముఖ్య‌మంత్రి ఎంత దూరం పెడుతున్నా కానీ, రాష్ట్రంలో ఏదో ఒక చోట టీడీపీ నాయ‌కుల‌ అవినీతి అక్ర‌మాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి... 
 
నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎప్పుడూ జ‌ర‌గ‌ని విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని గ్రామ స్థాయి టీడీపీ నాయ‌కుల నుంచి  ఎంపీల వ‌ర‌కూ చాలా మంది అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ప‌లు చోట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. 
 
అయితే తాజాగా మ‌రోసారి త‌మ్ముళ్ల అవినీతి గుట్టు ర‌ట్టు అయింది... అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి ప్రధాన అనుచ‌రుల‌లో ఒక‌రైన‌టు వంటి వ్య‌క్తికి  క్రికెట్ బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయ‌నే అనుమానంతో కొండ‌సాని సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు... అయ‌న‌ అరెస్ట్ తో న‌గ‌ర‌మంతా క‌ల‌క‌లం రేపుతోంది...
 
చాలా కాలంపాటు జేసి దివాక‌ర్ రెడ్డి ద‌గ్గర పీఏగా ప‌నిచేసిన సురేష్.. ఆ త‌ర్వాత తాడిప‌త్రి టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా భాద్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు... అయితే ఈ క్ర‌మంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని జేసి పేరిట‌ న‌గ‌రంలో అనేక అవినీతి అక్ర‌మాల‌కు, అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు... దీంతో పాటు గ‌తంలో  ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ను త‌యారు చేసుకుని,ఆయ‌న‌కు  వ్య‌తిరేక పోస్ట్ ల వైర‌ల్ వెనుక సురేష్ హ‌స్తం ఉంద‌ని పోలీసులు తెలిపారు.. అనుచ‌రుడి అరెస్ట్ తో జేసి డైల‌మాలో ఉన్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.