ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల‌కు కొత్త గుబులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp-flag
Updated:  2018-02-25 03:21:48

ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల‌కు కొత్త గుబులు

ఇంకా ఎన్నిక‌ల‌కు మ‌రో సంవ‌త్స‌రం స‌మ‌యం ఉంది.. కాని ఇప్ప‌టి నుంచే రాజ‌కీయపార్టీల్లో ఆందోళ‌న మొద‌లు అయింది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా త‌మ‌కు సీటు రావాలి అనే కృత నిశ్చ‌యంతో ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఓ వార్త తెలుగుపాలిటిక్స్ లో వైరల్ అవుతోంది.. తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఐదుగురికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌కూడ‌దు అనే ఉద్దేశ్యంలో సీఎం చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు అని చ‌ర్చ జ‌రుగుతోంది.
 
శింగనమల టిక్కెట్‌ హామీతో మంత్రి కాలవ శ్రీనివాసులు ఎమ్మార్పీఎస్‌ నాయకుడు ఎంఎస్‌ రాజును టీడీపీలో చేర్పించడం  చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై విప్‌ యామినీబాల.. ఆమె తల్లి, ఎమ్మెల్సీ శమంతకమణి ఒంటి కాలిపై లేస్తున్నారు. శింగనమల పరిణామంతో మిగిలిన నలుగురు సిట్టింగ్‌లలోనూ వణుకు మొదలైందని సొంత పార్టీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.
 
అనంత‌పురం జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్ ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు సుముఖ‌త చూప‌డం లేదు అనే వార్త ఇప్పుడు పొలిటిక‌ల్ గా హాట్ టాపిక్ గా మారింది. అస‌లు ఎంఎస్ రాజు వార్డ్ మెంబ‌ర్ గా కూడా గెల‌వ‌లేడు అలాంటి వ్య‌క్తిని ఎలా చంద్ర‌బాబు స‌మ‌క్షంలో పార్టీలోకి తీసుకున్నారు అనే విమ‌ర్శ‌లు వైరి వ‌ర్గం నుంచి వ‌చ్చింది.
 
ఇక అదే వ‌రుస‌లో జేసి ప్రొద్బ‌లంతో అనంత‌పురం మాజీ ఎమ్మెల్యే గురునాథ‌రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రికి పొగ‌పెట్టేలా అక్కడ రాజ‌కీయం జ‌రుగుతోంది అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక క‌ల్యాణ దుర్గం ఎమ్మెల్యే హ‌నుమంత‌రాయ చౌద‌రి ఆయ‌న ఎన్టీఆర్ నాటి నాయ‌కుడు, అయినా ఆయ‌న‌కు వ‌య‌సు అయిపోవ‌డంతో ఆయ‌న ప్లేస్ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోడ‌లు లేదా ఆయ‌న కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని బాబుకు ఇప్ప‌టికే తెలియ‌చేశార‌ట హ‌నుమంత‌రాయ చౌద‌రి. కాని ఈ ప్రాంతంలో కీల‌క నాయ‌కుడు బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వరావుకు టిక్కెట్టు ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నట్లు గ‌సుగుస‌లు వినిపిస్తున్నాయి.
 
గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు టిక్కెట్టు దక్కే పరిస్థితి లేదని సమాచారం. గుంతకల్లు నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అలాగే  పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి కూడా టిక్కెట్టు దక్కదనే ప్రచారం ఉంది. ప‌ల్లెను మంత్రి ప‌ద‌వి నుంచి కూడా ప‌లు కార‌ణాలు చూపి తీశారు అనే విమ‌ర్శ ఇప్ప‌టికీ ఉంది. కాని కొన్ని సామాజిక అంశాలు పరిశీలించి త‌న‌కే సీటు ఇవ్వ‌డానికి బాబు మెగ్గుచూపుతారు అంటున్నారు ప‌ల్లె.. ఇక  జిల్లాలో కాల‌వ శ్రీనివాసులు హవా పెరుగుతోంద‌ని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.