అనిత కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mla anitha
Updated:  2018-04-23 05:07:56

అనిత కీల‌క నిర్ణ‌యం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల నియామ‌కంపై తీవ్ర స్థాయిలో అభ్యంత‌రాలు ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి... అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యం ఏ మాత్రం న్యాయ బ‌ద్దంగా లేద‌ని వెంట‌నే టీటీడీ బోర్డు మెంబ‌ర్లుగా నియ‌మించిన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అలాగే బొండా ఉమాల‌ను వెంట‌నే తొల‌గించాలని బ్రాహ్మ‌ణ సంఘాలు  నిర‌స‌న‌లు తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే.
 
గ‌తంలో ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అనిత తాను క్రిస్టియన్ అని… ఇప్పటికీ త‌న‌ బ్యాగ్‌లో… కారులో బైబిల్ ఉంటుంది… బైబిల్ లేకుండా బయటకు వెళ్లనని చెప్పుకొచ్చింది... అయితే ఈ విడియోను చూసిన బ్ర‌హ్మ‌ణ‌ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నాయి... హిందూ సంప్రాదాయాన్ని దెబ్బ‌తీసే విధంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వివిధ మ‌తాల‌కు చెందిన వ్య‌క్తుల‌ను టీటీడీ బోర్డు స‌భ్యులుగా నియ‌మిస్తున్నార‌ని అంటున్నారు.. అయితే ఈ విష‌యంపై చంద్ర‌బాబు వెంట‌నే స్పందించాల‌ని లేక‌పోతే తాము పెద్దఎత్తున ఆందోళ‌న‌ను చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.
 
అయితే వారి నిర‌స‌నల‌ మేర‌కు అనిత వ్యవహారంపై అధికారులను చంద్రబాబు నివేదిక కోరారు. నివేదిక ఆధారంగా అధికార వర్గాలు చర్యలు తీసుకుంటార‌ని, అలాగే  హిందూ మత విశ్వాసాలకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు... అయితే ఈ నివేదిక పూర్తి కాక‌ముందే వంగలపూడి అనిత సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.
 
తాజాగా త‌న‌పై బ్రహ్మ‌ణ సంఘాలు, ఇత‌ర వ‌ర్గాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌లు, ఆందోళ‌న నేప‌థ్యంలో టీటీడీ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోరిన‌ట్లు ప్ర‌క‌టించారు... ఈ మేర‌కు అనిత ముఖ్య‌మంత్రికి లేఖ రాశారు... ఈ లేఖ‌ను తన నివాసం నుంచి ఫ్యాక్స్‌ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.