బాబుకు అన్నాడీఎంకే బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-24 17:47:13

బాబుకు అన్నాడీఎంకే బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్ర‌క‌టించాలంటూ రాష్ట్రంలో ఉన్న‌టువంటి అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ కేంద్ర ప్ర‌భుత్వం పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే  ప్ర‌త్యేక‌హోదా కోసం గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా పోరాటం చేస్తూ, చివ‌రికి కేంద్రంపై మొద‌ట‌గా అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించింది ప్ర‌తిప‌క్ష‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే... రాష్ట్ర వ్యాప్తంగాను, దేశ పార్ల‌మెంట్‌లోను ప్రత్యేక హోదా అంశం తీవ్రరూపం దాల్చితే గ‌తిలేక‌ అధికార తెలుగుదేశం పార్టీ కూడా హోదా నినాదం తీసుకుంద‌న్న‌ విష‌యం ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే.
 
ప్రత్యేక హోదా అంశం పై త‌మిళ‌నాడు అన్నాడీఎంకే ఎంపీ, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై  స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై అవిశ్వాసం అంటూనే  ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ లాలూచికి పాల్ప‌డుతున్నార‌ని  విమర్శించారు. టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి ఎట్టి ప‌రిస్థితుల్లోను మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని తంబిదురై తెలిపారు. అలాగే కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ సాధనే లక్ష్యంగా పార్లమెంట్‌ స్తంభించే రీతిలో తాము కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని అయ‌న అన్నారు.
 
ప్రత్యేక హోదాపై పార్ల‌మెంట్‌లో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తమకు సూచించడం విడ్డూరంగా ఉందని ఎంపీ తంబిదురై అన్నారు. తమిళ కూలీలను తుపాకులతో కాల్చి, నీళ్లల్లో ముంచి చంపుతున్న ఏపీ ప్రభుత్వానికి ఎలా మద్దతు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాకు  హోదా నినాదంతో ముందుగా వైఎస్సార్‌ సీపీ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన త‌ర్వాతే తెలుగుదేశం పార్టీ సిద్ధమైందని ఆయ‌న అన్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజకీయ చాణిక్యం ప్రదర్శిస్తున్నారని ఎంపీ తంబిదురై తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.