పార్ల‌మెంట్లో స్పీక‌ర్ స‌మ‌క్షంలో దాడి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

lok sabha postponed
Updated:  2018-03-27 05:13:39

పార్ల‌మెంట్లో స్పీక‌ర్ స‌మ‌క్షంలో దాడి

లోక్ స‌భ‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం స్పీకర్ సుమిత్ర మ‌హాజ‌న్ చ‌ర్చించ‌కుండా స‌భ ఆర్డ‌ర్ లో లేదంటూ ప్ర‌తీ రోజూ వాయిదాలు వేస్తూనే ఉన్నారు... అయితే ఈరోజు కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది.. అన్నాడీఎంకే స‌భ్యులు త‌మ‌కు కావేరి బోర్డ్ ఏర్పాటు చేయాలంటూ స‌భ ప్రారంభ‌మైన కొద్ది క్ష‌ణాల‌కే స్పీక‌ర్ ముందు ఫ్ల‌కార్డులు  ప‌ట్టుకొని నిర‌స‌న‌లు తెలిపారు.. దీంతో స‌భ ఆర్డ‌ర్ లో లేద‌ని స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు...  అయితే స్పీక‌ర్ అలా వాయిదా వేసిన మ‌రుక్ష‌ణ‌మే కాంగ్రెస్ పార్టీ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే స్పీక‌ర్ ముందు నిర‌స‌న‌లు తెలియ‌చేశారు.
 
ప్ర‌త్యేక హోదా అంశంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కావ‌ల‌సిన మ‌ద్ద‌తు కంటే చాలా ఎక్కువ‌గానే ఉంది, వేంట‌నే స‌భ‌లో స‌భ్యుల‌ను లెక్కించండి మేడం అంటూ చెప్పుకొచ్చారు ఖ‌ర్గే... ఈ ప్ర‌భుత్వం ఇంకా ఎన్నాళ్లు ఏదో ఒక సాకు చెప్పి స‌భ‌ను వాయిదా వేసుకుంటూ పోతుంది ఏదో ఒక రోజూ స‌భ జ‌రగాల్సిందే క‌దా మేడం.. ఇప్పుడు చర్చ మొదలైనట్లు ప్రకటించండి అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు ఖ‌ర్గే.
 
ఇదంతా కావాల‌నే చేస్తున్నార‌ని మిమ్మ‌ల్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నాట‌కాలు ఆడుతోంద‌ని ఏఐఏడీఎంకే నేత‌ల‌పై మండిప‌డ్డారు మల్లిఖార్జున ఖ‌ర్గే.. అలాగే వీరంద‌రూ  ప్ర‌ధానికి అమ్ముడుపోయార‌ని అన్నారు. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏఐఏడీఎంకే నేత‌లు వాగ్వాదానికి దిగారు...  ఒక‌ద‌శ‌లో అన్నాడీఎంకే ఎంపీలు ఖర్గేపై దాడికి దూసుకురాగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ అడ్డుపడ్డారు... దీంతో ఈ గొడ‌వ స‌ర్దుముఖం ప‌ట్టింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.