వైసీపీ ఎంట్రీకి అన్న రాంబాబు ఆరాటం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 16:20:18

వైసీపీ ఎంట్రీకి అన్న రాంబాబు ఆరాటం ?

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎంమ్మెల్యే అన్న రాంబాబు నిన్న జిల్లా వైస్సార్సీపీ ప్రెసిడెంట్ బాలినేని శ్రీనివాస రెడ్డి తో మరియు ఒంగోలు ఎంపీ వై.వి. సుబ్బా రెడ్డితో విడివిడిగా సమావేశమయ్యారు. వైస్సార్సీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు సుముకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
అయితే గతంలో అన్నరాంబాబు కి జైలు శిక్ష పడటం మరియు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలని వేధించడం మరియు కులాల వారీగా దూషించడం లాంటి అభియోగాలు ఉన్న అన్నరాంబాబు షరతులు లేకుండా ఎమ్మెల్యే టికెట్ ఆశించకుండా పార్టీ లోకి రావాలని జిల్లా వైస్సార్సీపీ ప్రెసిడెంట్ బాలినేని శ్రీనివాస రెడ్డి మరియు ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బా రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 
 
రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఆర్థికంగా బలవంతుడైన ఐ.వి.రెడ్డి వైస్సార్సీపీ సమన్వయ కర్తగా కొనసాగుతున్నారు.ఇప్పటికే గిద్దలూరు వైసీపీ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికే ఖరారు అయింది.
 
రాజకీయంలో తన ఉనికిని చాటుకునేందుకే అన్న రాంబాబు వైసీపీ ఎంట్రీ కి ఆరాట పడుతున్నారని ఇప్పటికే నియోజకవర్గంలో గుసగుసలు మొదలయ్యాయి. ఒకవేళ అన్న రాంబాబుకి వైసీపీ టికెట్ కేటాయించిన ఇప్పటికే అన్న రాంబాబు ప్రవర్తనతో విసిగిపోయిన గిద్దలూరు రెడ్డి మరియు ఇతర సామాజిక వర్గం వారు అక్కున చేర్చుకుంటారా అంటే అవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలే అంటున్నారు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.