జ‌గ‌న్ కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-09 11:12:16

జ‌గ‌న్ కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై కేసుల అభియోగాల గురించి తెలిసిందే.. ఆయ‌న్ని అక్ర‌మాస్తుల కేసులో కాంగ్రెస్ ఇరికించింది అనే వాద‌నే ఇప్ప‌టికీ తెలుగునాట వినిపిస్తోంది... వైసీపీ నాయకులు చెబుతున్న‌ట్టు జ‌గ‌న్ క‌డిగిన ముత్యంలా త‌న కేసుల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు అని అంటున్నారు నాయ‌కులు.. దానికి కార‌ణాలు కూడా చూపుతున్నారు.
 
తాజాగా జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం  చోటు చేసుకుంది.. జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబ‌డుల విష‌యంలో 34.64 కోట్ల రూపాయ‌లు ఈడీ తాత్కాలిక జ్ఞ‌ప్తు చేయ‌డాన్ని అప్పిలేట్ ట్రైబ్యున‌ల్ కోర్టు త‌ప్పుబ‌ట్టింది....జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ కు సంబంధించి 2013 లో ఈడీ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను ట్రైబ్యున‌ల్ కోర్టు కొట్టివేసింది....మోస‌పూరితంగా పెట్టుబ‌డులు స్వీక‌రిస్తే మ‌నీలాండ‌రింగ్ ఎలా అవుతుంది అని ప్ర‌శ్నించింది కోర్టు..దీంతో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో అప్పిలేట్ ట్రైబ్యున‌ల్ లో ఈడీకి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్టు అయింది. ఈడీ వాదనలని తోసిపుచ్చిన కోర్టు జ్ఞ‌ప్తు చేయటం చెల్లదు అని తేల్చిచెప్పింది.
 
ఇప్ప‌టికే జ‌గ‌న్ కేసుల్లో ఒక్కో చార్జ్ షీటు కొట్టివేయ‌బ‌డుతోంది. సీబీఐ - ఈడీ దోషులుగా ఎవ‌రిని తేల్చారో వారు నిర్దోషులుగా బ‌య‌ట‌కువ‌స్తున్నారు.. అన్నీ అభియోగాలు అని, కుట్ర‌పూరితంగా జ‌గ‌న్ ని  ఇరికించారు అని ఇప్ప‌టికే ప‌లువురు అధికారులు రాజ‌కీయ నాయ‌కులు కూడా తెలియ‌చేశారు. ఇవ‌న్ని చూస్తుంటే జ‌గ‌న్ కు వ‌చ్చే రోజుల్లో క్లీన్ చీట్ రావ‌డం ప‌క్కా అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.