సంచ‌ల‌నం తాడిప‌త్రిలో మ‌రో వివాదం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp divakar reddy
Updated:  2018-09-25 12:35:23

సంచ‌ల‌నం తాడిప‌త్రిలో మ‌రో వివాదం

అనంపురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో వివాదం చోటు చేసుకుంది. తాజాగా ప్ర‌భోదానంద స్వామి భ‌క్తుల‌ను అధికారులు టార్గెట్ చేసి ఆదార్ కార్డులున్న వారిని కూడా ఖాళీ చేయాలంటున్నార‌ని ఆశ్ర‌మంలోని భ‌క్తులు ఆరోపిస్తున్నారు. అయితే స్థానికుల‌ను పంప‌వ‌ద్ద‌ని హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసినా వాటిని అధికారులు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని భ‌క్తులు అంటున్నారు. 
 
భ‌క్తులంద‌రిని ఖాళీ చేయించి ప్ర‌భోదానంద స్వామి ఆశ్ర‌మాన్ని టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి అప్ప‌గించే కుట్ర జ‌రుగుతుంద‌ని స్వామి ప్ర‌తినిధులు ఆరోపిస్తున్నారు. ప్ర‌భోదానంద స్వామి భ‌క్తుల‌కు జేసీ వ‌ర్గీయుల నుండి వేంధింపులు ఎక్కువ అయ్యాయ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 
 
అంతేకాదు తాడిప‌త్రి నుంచి విడిచిపెట్టి వెళ్లిపోవాల‌ని త‌మ‌కు బెదిరింపులు వ‌స్తున్న‌ట్లు వారు చెబుతున్నారు. అయితే త‌మ‌కు ఎన్ని బెదిరింపులు వ‌చ్చినా కూడా ఆశ్ర‌మం వ‌దిలి పెట్టి వెళ్ల‌మ‌ని భ‌క్తులు అంటున్నారు. ఆశ్ర‌మంలో ఇవాళ‌ జ‌ర‌గాల్సిన పౌర్ణ‌మి వేడుక‌లను  కూడా ర‌ద్దు చేశారు. ఈ గొడ‌వ జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టికీ 144 సెక్ష‌న్ కొన‌సాగుతూనే ఉంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.