వైసీపీలోకి చేరిన‌ మ‌రో నాయ‌కుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan narayan reddy image
Updated:  2018-03-13 03:14:34

వైసీపీలోకి చేరిన‌ మ‌రో నాయ‌కుడు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాదయాత్ర రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాలు అలాగే , నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలో కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్... ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేస్తున్న‌ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున హ‌జ‌ర‌వుతున్నారు.
 
ఇక తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో భ‌విష్యత్తు లేద‌ని వైసీపీ విధానాలు రూపొందించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు న‌చ్చి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున నాయ‌కులు వ‌స్తున్నారు. జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున వ‌స్తున్న మ‌ద్ద‌తుతో జ‌గ‌న్ పై నాయ‌కుల్లో మ‌రింత ప్ర‌జాబ‌లం పెరిగింది అనే చెప్పాలి.
 
ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి అయిన పాద‌యాత్ర‌లో అనేక మంది నాయ‌కులు వైసీపీలో చేరారు. తాజాగా గుంటూరు జిల్లాలో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయ‌కుడు చేజర్ల నారాయణరెడ్డి,  అనుచరులతో కలిసి వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  ఆయన వెంట కళ్ళం హరినాథరెడ్డి తదితరులు ఉన్నారు. జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల్లో సరికొత్త ఒర‌వ‌డిని తీసుకువ‌స్తుంది అంటున్నారు విశ్లేష‌కులు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.