బ్రేకింగ్ బాబుకు వ్య‌తిరేకంగా జ‌గ‌న్ కు ధీటుగా మ‌రో పాద‌యాత్ర‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap
Updated:  2018-07-18 05:54:28

బ్రేకింగ్ బాబుకు వ్య‌తిరేకంగా జ‌గ‌న్ కు ధీటుగా మ‌రో పాద‌యాత్ర‌

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌తిక్ష‌వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు ఇత‌ర పార్టీ నాయ‌కులు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ప‌ట్టు సాధించుకోవాల‌నే ఉద్దేశ్యంతో పాద‌యాత్ర చేస్తుంటారులే అనుకుంటే మీరు అక్క‌డ పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఎందుకంటే 2014 లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి అన్ని వర్గాల‌కు చెందిన వారు తాము న‌ష్ట‌పోయామ‌ని భ‌హిరంగంగానే చెబుతున్నారు. 
 
ఇక ఒక్కసారి చ‌రిత్ర‌ను వెన‌క్కి చూసిన‌ట్లు అయితే  పీఠాధిప‌తులు ఎక్క‌డా కూడా రోడ్డు ఎక్కి ధ‌ర్నాలు చేసిన దాఖ‌లాలు క‌నిపించ‌వు కానీ టీడీపీ హయాంలో అది కూడా పూర్తి అయింది. కొద్ది రోజుల క్రితం అక్ర‌మంగా స్వామీజీల‌ను అరెస్ట్  చేయడం ఆల‌యాల నుంచి బ‌హిష్కృతం చేయడం వంటివి టీడీపీ హయాంలోనే జ‌రిగాయి. అందుకే టీడీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా విజ‌య‌వాడ దుర్గ‌మ్మ గుడి నుంచి తిరుప‌తి దాక‌ పాద‌యాత్ర చేసేందుకు పీఠాధిప‌తులు సిద్ద‌మ‌య్యారు. 
 
ఈ విషయాన్ని స్వ‌యాన కోటిలింగాల శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి స్ప‌ష్టం చేశారు. ఈ నెల 19 వ తేదీ రోజు తెలుగు రాష్ట్రాల జాతీయ ర‌హదారిని దిగ్భందిస్తూ పాద‌యాత్ర చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ ఆందోళ‌న‌కు అన్నీ ధార్మిక సంస్థలు చెందిన వారు పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే టీటీడీలో అవకతవకలు బయట పెట్టేందుకు ఈ నెల 29 నుండి హిందూ సమాజం రోడ్డెక్కుతుందని తెలిపారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఛ‌లో తిరుప‌తి పాద‌యాత్ర‌కు సుమారు 300 వంద‌ల మంది శిష్యుల‌తో క‌లిసి ప్ర‌తీ రోజు 30 కిలో మీట‌ర్ల మేర చొప్పున 15 రోజుల పాటు సాగుతుంద‌ని పీఠాధిప‌తి స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత తిరుప‌తికి చేరుకోగానే అక్క‌డ భారీ భ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని పేర్కొన్నారు. ఈ స‌భ‌కు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి సూమారు 100 మంది పీఠాధిప‌తులు పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.