జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy image
Updated:  2018-03-06 04:02:31

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఇటు అధికార పార్టీ నాయ‌కులు, అటు ప్ర‌తి ప‌క్ష నేత‌లు అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా విస్రృత ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా సాగిస్తున్నారు... అయితే ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాలు రానే వ‌చ్చాయి.... గ‌త అసెంబ్లీ స‌మావేశాల‌కు ప్ర‌స్తుతం జ‌రుగనున్న స‌మావేశాల‌కు ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఒక్క‌రు కూడా హాజ‌రు కాలేదు.... దీంతో అధికార తెలుగు దేశం నాయ‌కులు త‌మ‌కు అనుకూలంగా ప్ర‌తీ బిల్లుల‌ను పాస్ చేసుకుంటున్నారు.
 
వైయ‌స్సార్  కాంగ్రెస్ పార్టీ త‌రుపున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా  చేయించేంత వ‌ర‌కూ  తాము అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్ట‌కూడ‌ద‌ని వైసీపీ నాయ‌కులు తీర్మానం చేసుకున్నారు... దీంతో ఈ రెండు స‌మావేశాల‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌రు కాక‌పోవ‌డంతో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు.... ఇంత వరకూ ఏ విపక్షం కూడా బడ్జెట్ సమావేశాలను బహిష్కరించలేదు.. దీంతో జ‌గ‌న్ కు ఇదో రికార్డ్ అని చెప్పాలి.
 
ఈ అసెంబ్లీ స‌మావేశాలు సుమారు ఈ నెల‌ 29 వ‌ర‌కూ  జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో  విభ‌జ‌న చ‌ట్టంలో పెర్కొన్న అంశాల‌ను, రాష్ట్రానికి రావ‌ల‌సిన నిధుల‌పై టీడీపీ నాయ‌కులు వారికి వారే ప్ర‌శ్న‌లు వేసుకుంటున్నారు... ఈ స‌మావేశంలో చంద్ర బాబు మాట్లాడుతూ... తాము కేంద్రంతో మిత్ర ప‌క్షంగా ఉన్నాము కాబ‌ట్టే ప్ర‌త్యేక హోదా విష‌యంలో సైలెంట్ గా ఉన్నామ‌ని లేదంటే ఇంకా ఎక్కువ‌ ఫైట్ చేసేవాడినంటూ, ముఖ్యమంత్రి మాట మారుస్తూ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. 
 
అయితే గత సమావేశాల్లోనూ ప్రతిపక్షం లేకపోయినా, పార్టీ పరంగా ఆ పాత్రని  అధికార పక్షమే నిర్వహించింది. రోజుకు 10 ప్ర‌శ్న‌లు చొప్పున‌ మొత్తం 300 పైచిలుకు ప్రశ్నలు ఉభయసభల్లో లేవనెత్తేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.