జ‌గ‌న్ కేసుల్లో మ‌రో ఊర‌ట

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-15 15:53:26

జ‌గ‌న్ కేసుల్లో మ‌రో ఊర‌ట

జ‌గ‌న్ కేసులు ఒక్కొక్క‌టి వీగిపోతున్నాయి.. జ‌గ‌న్ ని అక్ర‌మంగా అన్యాయంగా ఇరికించారు అనేది నేడు ప్ర‌జ‌ల‌కు మొత్తం అర్ధ‌మైంది... తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మ‌క్కై జ‌గ‌న్ ని కేసుల్లో ఇరికించారు అని ఉభ‌య‌తెలుగు రాష్ట్రాల‌కు అర్ద‌మ‌వుతోంది.. ఇటీవ‌ల ప‌లు చార్జ్ షీట్లు కొట్టివేయ‌ప‌డుతున్నాయి. తాజాగా జ‌రిగిన మ‌రో కేసు విష‌యం కూడా జ‌గ‌న్ కు కాస్త ఊర‌టనిచ్చింది అనే చెప్పాలి.
 
సాక్షి మరియు అరబిందో ఆస్తుల కేసులో ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించింది . కేసుని కొట్టివేస్తూ అక్రమంగా ఆస్తులు అటాచ్లు చేశారని  ఈడీని ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుపట్టింది ....కేసు కొట్టివేస్తూ ట్రిబ్యునల్ ఈడీని కొన్ని ప్ర‌శ్న‌లు అడిగింది.
 
ఎవరైనా 21 కోట్లు లాభం కోసం 29 కోట్లు పెట్టుబడులు పెడతారా ? అసలు  మీరు చేసిన ఈ ఆరోపణని ఎలా సమర్ధించుకొంటారు ? 
 
జగన్ , సాయిరెడ్డి లు ఇన్వెస్టర్లని మోసం చేసి పెట్టుబడులు పెట్టించారని ఈడీ ఆరోపణ .. ఒకవేళ ఇదే ఆరోపణ నిజమనుకొంటే ఆ ఇన్వెస్టర్లు కేసులు పెట్టాలి కానీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా మీరు కేసు పెట్టటం ఏమిటి ? 
కనీసం ఆ ఇన్వెస్టర్లు మేము మోసపోయామని మిమ్మల్ని సంప్రదించారా ? 
 
సాక్షిలో 60 మంది పెట్టుబడులు పెడితే కేవలం కొంతమందిని మాత్రమే కేసుల్లో ఎందుకు పెట్టారు ? 
 
అసలు కేసులతో సంభంధం లేని ఆస్తులని అటాచ్ చేయటం ఏమిటి ? 
 
సాక్షిలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని కానీ లేదా నష్టపోయామని కానీ లేదా బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని కానీ మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా ? 
 
ఇవీ ముఖ్యంగా ఈడీని ట్రిబ్యునల్ అడిగిన ప్రశ్నలు . వీటిలో ఏ ఒక్కదానికి ఈడీ సమాధానం చెప్పలేదు . 
 
అసలు ఈ కేసులన్నీ అక్రమంగా పెట్టినట్లు కనిపిస్తుందని , అసలు వీటిలో ఈడీ బాధ్యతారాహిత్యం కనిపిస్తుందని తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టివేసింది.
 
ఇక్క‌డ వైసీపీ నాయ‌కులు మేధావులు ఓ ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తుతున్నారు.. ఆనాడు కేసులు పెట్టి అడ్డంగా ఇరికించిన జేడీ లక్ష్మీనారాయణ బయటకి వచ్చి ట్రిబ్యునల్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి అని ప్ర‌శ్నిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.