వివాదంలో మ‌రో టీడీపీ ఎమ్మెల్యే...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-30 10:50:59

వివాదంలో మ‌రో టీడీపీ ఎమ్మెల్యే...

మ‌హిళ‌ల‌పట్ల‌ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చూపుతున్న‌ వైఖ‌రి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్ప‌దంగా మారుతుంది. గ‌తంలో టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ప్ర‌భుత్వ ఉద్యోగి వ‌న‌జాక్షి పై దాడి చేసి వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ వార్తను రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రువ‌క‌ముందే మ‌రో ఎమ్మెల్యే తాజాగా వార్త‌ల్లో నిలిచారు. 
 
దీంతో ఆ మ‌హిళ త‌నకు జ‌రిగిన అవ‌మానాన్ని త‌ట్టుకోలేక త‌న విధుల‌కు సెల‌వు ప్ర‌క‌టించి వెళ్లిపోయింది. తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎస్. వ‌ర్మ గొల్ల‌ప్రోలు మున్సిప‌ల్ శానిట‌రీ ఇన్స్ పెక్ట‌ర్ శివ‌ల‌క్ష్మీతో బ‌ల‌వంతంగా క‌చ్చ డ్రైనేజీలో చేయి పెట్టించి మురుగు నీటిని మ‌ట్టిని వ‌ర్మ ఎత్తించారు. ఇటీవ‌లే గ్రామ‌ద‌ర్శి కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా స్థానికులు వ‌ర్మ‌కు ఫోస్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారుల‌కు ఆయ‌న ఫోన్ చేసి బండ‌బూతులు తిట్టిపోశారు. 
 
అంతేకాదు శివ‌ల‌క్ష్మీని పిలిపించుకుని అంద‌రు చూస్తుండ‌గానే ఆమెతో బ‌ల‌వంతంగా డ్రైనేజీ లో చేయి పెట్టించి ఫోన్‌ లాక్కున్నారు. దీంతో ఆమె మ‌న‌స్థాపానికి గురి అయి త‌న విధుల‌కు సెల‌వుమీద వెళ్లిపోయింది. దాదాపు 40 వేల మంది ఉన్న గొల్ల‌ప్రోలులో 60 మంది శానిట‌రి సిబ్బంది కావాల‌ని కానీ  32 మంది మాత్ర‌మే ఉన్నార‌ని ఆమె మండిప‌డింది. మళ్లీ వ‌ర్మ త‌న జోలికివ‌స్తే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని హెచ్చ‌రించింది. 

షేర్ :

Comments

0 Comment