కాంగ్రెస్-టీడీపీ దోస్తీతో మ‌రో వికెట్ ఔట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

rahul and chandrababu
Updated:  2018-11-03 11:38:26

కాంగ్రెస్-టీడీపీ దోస్తీతో మ‌రో వికెట్ ఔట్

తెలుగుదేశంపార్టీ తో దోస్తీ కాంగ్రెస్ పార్టీలో తాజాగా పెద్ద‌కుంప‌టే తెచ్చిపెడుతోంది. ద‌శాబ్దాల శ‌త్ర‌వు టీడీపీతో క‌ల‌వ‌డాన్ని నిర‌సిస్తూ చాలామంది సీనియ‌ర్ నేత‌లు పార్టీల‌ను వీడుతున్నారు. ఇదే క్ర‌మంలో మొన్న టీడీపీకి వ‌ట్టి వ‌సంత‌కూమార్ రాజీనామా చేయ‌గా తాజాగా మ‌రో సీనియ‌ర్ నేత సీ రామచంద్ర‌య్య కూడా పార్టీని వీడుతున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, రాహుల్ తో స్నేహాన్ని ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. 
 
అంతేకాదు కాసేప‌ట్లో ఆయ‌న పార్టీ మార‌డంపై ఒక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. అయితే పార్టీ లో ర‌క‌ర‌కాల అభిప్రాయాలు ఉండ‌టం స‌హ‌జ‌మే అంటున్నారు ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి.  పార్టీ నాయ‌కులు తొంద‌ర‌ప‌డి ఎవ్వ‌రూ నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ తెలుగు దేశంపార్టీ అని గ‌తంలో కాంగ్రెస్ ను విమ‌ర్శిస్తూ అనేక విమ‌ర్శ‌లు చేసిన టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో దోస్తీ చేయ‌డంపై పార్టీ నాయ‌కులు జీర్ణించు కోలేక‌పోతున్నారు. 
 
ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ఇద్ద‌రు మంత్రులు కూడా తీవ్రంగా వ్య‌తిరేకించారు.. 2019లో ఈ రెండు పార్టీలు క‌లిసి ప‌ని చేస్తే తాను ఉరి వేసుకుంటాన‌ని చెప్ప‌గా మ‌రో మంత్రి ఎట్టి ప‌రిస్థితిలో కాంగ్రెస్ టీడీపీ పొత్తులుండ‌వ‌ని ఒక వేళ‌ పొత్తుకుదిరితే తాను పార్టీకి గుడ్ భై చెబుతాన‌ని ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.