మ‌రో వికెట్ అవుట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 13:38:51

మ‌రో వికెట్ అవుట్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌స్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయ‌కులు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల దృష్టిలో ఉంచుకొని టీడీపీ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స‌లు పోతున్నారు.
 
ఇక ఇప్ప‌టికే ఏపీలో టీడీపీ నేత య‌ల‌మంచిలి ర‌వి ప్ర‌తిప‌క్షనేత‌ వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా ఈ రోజు సీనియ‌ర్ నేత, హోం శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్, నేడు వైయ‌స్సార్  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్ని ఆయన అనుచరులు పూర్తి చేశారు.
 
ఇక దీంతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కూడా ఎదురు దెబ్బ త‌గిలింది. ఇక్క‌డ టీడీపీ నాయ‌కులు అర‌కొర‌కు ఉన్ననాయ‌కులు కూడా త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల ప‌రిణామాల దృష్ట్యా ఇత‌ర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.అయితే ఇప్ప‌టికే తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున కీల‌క బాధ్య‌త‌లను వ్య‌వ‌హ‌రించిన రేవంత్ రెడ్డి గ‌తంలో టీడీపీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన సంగ‌తి తెలిందే.
 
ఇక తాజాగా ఇదే దారిలో టీడీపీకి చెందిన మరో కీల‌క నాయ‌కుడు వంటేరు ప్రతాప్ రెడ్డి త‌న‌ అనుచరులతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ కూడా ఆయన వెంట ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. మొత్తానికి చూస్తుంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో టీడీపీ నుంచి వ‌ల‌స‌లు పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.