ఎట్ట‌కేల‌కు ఒప్పుకున్న అనుష్క‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

anushka fixed new film
Updated:  2018-03-23 06:33:39

ఎట్ట‌కేల‌కు ఒప్పుకున్న అనుష్క‌

బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ అంత‌ర్జాతీయ స్దాయిలో  గుర్తింపు పోందింది. అయితే అందులో న‌టించిన న‌టీన‌టులకు  కూడా అదే విధ‌మైన గుర్తింపు ల‌భించింది... అందులో ముఖ్యంగా హీరోయిన్ అనుష్కకు బాహుబలి సినిమా త‌ర్వాత‌ విప‌రీత‌మైన డిమాండ్ పెరిగిన విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే అప్ప‌టి నుంచి ఏ చిత్రాన్ని కూడా అనుష్క తెర‌కెక్కించ‌లేదు. అయితే ఇటీవ‌ల వ‌చ్చిన భాగమతి కూడా బాహుబలికి ముందే ఒప్పుకున్న సినిమా అనేది తెలిసిందే. 
 
ఓ వైపు ఆమె పెళ్లి పై పుకార్లు వస్తున్న నేపథ్యంలో,  హీరోయిన్ అనుష్క ఇక  సినిమాలు చేయ‌ద‌ని అంతా అనుకున్నారు. కానీ ద‌ర్శ‌కులు మాత్రం ఆమెకు  త‌గ్గ క‌థ‌ల‌ను త‌యారుచేసి వినిపిస్తున్నారు. వీటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పిన స్టోరీ కూడా ఉంది...ఈ చిత్రాన్ని ఫైనలైజ్ చేసే పనిలో ఉంది స్టార్ హీరోయిన్ అనుష్క‌.  గౌతమ్ మీనన్ చెప్పిన ఒక్క లైన్‌కే అనుష్క ఓటేసినట్టు సమాచారం. ఈ సినిమా గురించి ఇప్ప‌డు టాలీవుడ్ లో చ‌ర్చించుకుంటున్నారు.
 
ప్రస్తుతం విక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు గౌతమ్ మీనన్. ఇది విడుదల‌ అయిన వెంటనే అనుష్కతో చేయబోయే సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.... మ‌రోవైపు అనుష్క కూడా బరువు తగ్గే పనిలో బిజీగా ఉంద‌ని తెలుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కు, రోటీన్ పాత్ర‌ల‌కు అనుష్క దూరమనే విషయం తెలిసిందే.  కథ మొత్తం ఆమె చుట్టూనే తిరగాలి. అలాంటి స్టోరీనే సిద్ధం చేశాడట గౌతమ్ మీనన్. ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా సరికొత్త మేకోవర్ లో ఆమె కనిపిస్తుందట. నిజ‌మే ఆమె తీసుకునే క‌థ‌లు... చూస్ చేసే స్టోరీలు వైవిధ్య‌భ‌రితంగా ఉంటాయి...  ఆ పాత్ర‌ల‌కు అనుష్క న్యాయం చేస్తుంది అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.