చిక్కుల్లో స్పీక‌ర్ కోడెల‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 01:39:04

చిక్కుల్లో స్పీక‌ర్ కోడెల‌

కొన్ని విష‌యాలు విన‌డానికి  ఆశ్చ‌ర్యంగా ఉంటాయి. ఒక ఘ‌ట‌న మ‌రికొన్ని సంఘ‌ట‌న‌ల‌కు దారి తీస్తుంది.  కొన్ని ఇబ్బందుల‌నూ తెచ్చిపెడుతుంది. అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావుకు ఏర్ప‌డింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 
 
అది కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఈ ప‌రిస్థితి ఎదురైంద‌ని చెబుతున్నారు... విష‌యంలోకి వెళ్తే ?విప‌క్ష  వైసీపీ ఎమ్మెల్యేల‌ను అధికార టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అనే పేరుతో పార్టీలో చేర్చుకున్నారు.. గ‌త రెండేళ్లుగా ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యేలను వ‌రుస పెట్టి పార్టీలోకి చేర్చుకుంటూనే ఉన్నారు. దీంతో వైసీపీ బ‌లం 44 ఎమ్మెల్యేల‌కు చేరుకుంది. ఈ ప‌రిణామంతో రెండు ర‌కాలుగా వైసీపీ అధినేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఒక‌టి రాష్ట్రంలో విప‌క్షం ప‌లుచ‌న కావ‌డం, రెండు ప‌ద‌వుల ప‌రంగానూ పార్టీ స‌న్న‌గిల్ల‌డం. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకుంది.... వైసీపీ త‌ర‌ఫున 2014లో గెలుపొంది, త‌ర్వాత ప‌ద‌వుల కోసం స‌ద‌రు ఎమ్మెల్యేలు పార్టీ మారార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ పెద్ద ఎత్తున విమ‌ర్శించారు. 
 
ఈ క్ర‌మంలోనే వారంద‌రిపైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేయ‌డంతో పాటు.. ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని, లేదా వారంద‌రితో రాజీనామా చేయించాల‌ని జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. అటు సీఎం కానీ, ఇటు అసెంబ్లీ స్పీక‌ర్ కానీ స్పందించ‌లేదు... దీంతో ఈ విష‌యంపై ఇప్ప‌టికీ వైసీపీ ఆందోళ‌న చేస్తూనే ఉంది... ఇదిలావుంటే,ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ విష‌యం తాజాగా  తెర‌మీద‌కి వ‌చ్చింది.
 
 గ‌త కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా ఉన్న వ‌ట్టి వ‌సంత్‌కుమార్ పై, అలాగే గ‌న్ మెన్‌పై చేయిచేసుకున్న నేరానికి స్థానిక కోర్టు చింత‌మనేనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది...  అదును కోసం ఎదురు చూస్తున్న వైసీపీ, ఈ ప‌రిణామాల‌న్నింటిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకున్న వైసీపీ నేత‌లు.. చింత‌మనేనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఆయ‌న‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు...ఇది స్పీక‌ర్ చేతిలో ఉన్న విష‌యం.  
 
ఒక‌వేళ స్పీక‌ర్ ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే.. ఓ నేర‌స్తుడికి, అందునా అధికార పార్టీకి చెందిన నేత‌కు స్పీక‌ర్ కొమ్ము కాస్తున్నార‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకునే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. పోనీ.. సాహ‌సం చేసి చింత‌మ‌నేనిపై వేటు వేస్తే.. దీనిని కూడా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త‌మ పార్టీ నుంచి ఫిరాయించిన వారిపైనా అన‌ర్హ‌త వేయాల‌ని డిమాండ్ చేయ‌డంతోపాటు స్పీక‌ర్ నిర్ణ‌యాల‌పై కోర్టుకు ఎక్కే ప‌రిస్థితి కూడా ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు స్పీక‌ర్ కు ఇబ్బంది క‌ర వాతావ‌ర‌ణ‌మే ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

షేర్ :

Comments

1 Comment

  1. పార్టీ మరీనా m l a ల ను అనర్హులుగా ప్రకటించాలి. అది న్యాయం.

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.