లీడర్ గా ఎదిగిన ఒకే ఒక నాయకుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-03 18:51:08

లీడర్ గా ఎదిగిన ఒకే ఒక నాయకుడు

ఏ లీడర్ కి అయినా  కొన్ని లక్షణాలు ఉండాలి.. ఆ లక్షణాలను మరిచిపోయి తన స్వార్థం కోసం చూసుకుంటే వ్యవస్థ నాశనం అవుతుంది...ప్రస్తుత సమకాలీన రాజకీయ నాయకులను గమనిస్తే మాత్రం, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎదో మంచి చేయాలి అని వస్తారు...కానీ రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా మారిపోయి పాటించాల్సిన లక్షణాలను మర్చిపోతున్నారు... లీడర్ కి ఉండవలసిన లక్షణాలు...
 
1. లీడర్ - గతాన్ని మర్చిపోయి, గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ విజయం వైపు పయనించాలి...
2. లీడర్ - ఎంత తెలిసినా, నిరంతరం కొత్త దాన్ని నేర్చుకుంటూ ఉండాలి...
3. లీడర్ -  మన మనసులో ఏమి చెప్పాలనుకుంటున్నామో... ఆ విషయాన్ని బయట అలాగే చెప్పగలగాలి...
4. లీడర్ - లీడర్ అనే వాడు ఈగోని వదిలేసి...అందరితో కలగలుపుకొని వెళ్ళాలి...
5. లీడర్ - తన బాధ్యతని గుర్తించి, దాని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలి...
6. లీడర్ - తప్పును కూడా ప్రశాంతంగా చెప్పగలగాలి.
7. లీడర్ - ఎవరైనా బాధ‌లో ఉంటే వాళ్లకు ఓదార్పుతో పాటు నేనున్నానే మనో ధైర్యాన్ని ఇవ్వాలి.
8. లీడర్ - నష్టపోయిన వారికి భ‌రోసా ఇచ్చి, వారిని ఆదుకోవాలి.
9. లీడర్ -  గెలుపోటములను ఒకే విధంగా స్వీకరించాలి...
10. లీడర్ - ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి...
11. లీడర్  - మార్గ దర్శకుడు అయ్యి ఉండాలి...
12. లీడర్ - ఎంత కష్టం వచ్చినా  ముఖంలో చిరునవ్వు ఉండాలి...
13. లీడర్ - పదవుల కోసం కాంప్రమైజ్ అవ్వకుండా, సమాజం కోసం పాటుపడాలి...
14. లీడర్ - తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉంది నడపాలి...
15. లీడర్ - కష్టపడే కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ, వాళ్ళను ఎప్పుడు ఉత్తేజపరచాలి...
16. లీడర్ - తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి.
17. లీడర్ - సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతో కొంత ఇస్తూనే ఉండాలి.
18. లీడర్ - అనుచరుల ఎదుగుదలను కోరుకోవాలి తప్ప...వాళ్ళతో ఆడుకోకూడదు.
19. లీడర్ - తన స్వార్థం కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాలి...
 
ఈ నాలుగేళ్ళ నుండి వాస్తవిక, సమకాలీన రాజకీయలను గమనిస్తే, పార్టీ స్తాపించినప్పటి నుండి ఒకే మాటపై నిలబడిన జగన్ లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.