కామినేని - మాణిక్యాల‌రావు మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-08 11:18:54

కామినేని - మాణిక్యాల‌రావు మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా

కేంద్రానికి  ఇక్క‌డ తెలుగుదేశం క‌టీఫ్ చెప్ప‌డంతో తెలుగుదేశంలో ఏపీలో మిత్ర‌ప‌క్ష వైఖ‌రిగా ముందుకు వెళుతున్న బీజేపీ నాయ‌కులు కూడా బ‌య‌ట‌కు రావాలి అని నిర్ణ‌యించుకున్నారు... అనుకున్న‌దే త‌డ‌వుగా ఏపీలో మంత్రి వ‌ర్గంలో కొన‌సాగుతున్న ఇరువురు  బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్ అలాగే పైడికొండ‌ల మాణిక్యాల‌రావు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి సీఎం చంద్ర‌బాబు కు స‌మ‌ర్పించి, అధికారికంగా త‌మ‌కు వ‌చ్చిన ఐడీలు అలాగే వాహ‌నాలను అధికారుల‌కు స‌మ‌ర్పించారు.
 
ఇక అసెంబ్లీ మంత్రివ‌ర్గ కార్యాల‌యాల్లో వారిని ఏపీ తెలుగుదేశం మంత్రులు ప‌ల‌క‌రించారు.. పార్టీ నిర్ణ‌యం ప్ర‌కారం రాజ‌కీయాల్లో త‌ప్ప‌దు అని మంత్రి కామినేని అన్నారు.. రాజ‌కీయాల్లో ఎంట్రీ ఎలా ఆనందంగా ఉంటుందో ప‌ద‌వులు వ‌చ్చిన త‌ర్వాత ఎక్సిట్ కూడా అలాగే తీసుకోవాలి అని ఆయ‌న అన్నారు..
 
ఆయ‌న్ని రాజీనామా ప‌త్రాలు ఇచ్చేస‌మ‌యంలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు అలాగే అచ్చెన్నాయుడు క‌లిసి బాధ‌ప‌డ్డారు.. నేటి వ‌ర‌కూ మంత్రిగా క‌లిసి మాతో ప‌నిచేసిన మీరు నేడు మంత్రి ప‌దవుల‌కు దూరం అవుతున్నారు అని, ఇది బాధాక‌ర‌మ‌ని అన్నారు గంటా.. ఇక మాణిక్యాల‌రావును కూడా క‌లిసి ప‌లువురు తెలుగుదేశం నాయ‌కులు త‌మ బాధ‌ను వెళ్ల‌గ‌క్కారు.
 
రాజీనామాలు చేసిన త‌ర్వాత అసెంబ్లీలో కామినేని మాణిక్యాల‌రావు ఇరువురు మాట్లాడ‌టం జ‌రిగింది... ఏపీకి కేంద్రం అన్నివిధాలా సాయం చేసింది అని అన్నారు కామినేని.. త‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క అవినీతి మ‌చ్చ‌లేద‌ని త‌న‌కు మంత్రిగా అవ‌కాశం ఇచ్చినందుకు పార్టీ త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..
 
అలాగే మాణిక్యాల‌రావు మాట్లాడుతూ త‌న‌కు ఆ అవ‌కాశం ఇచ్చిన తాడేప‌ల్లి గూడెం ప్ర‌జ‌ల‌కు  త‌న‌ని ఇంత పైకి తీసుకువ‌చ్చిన బీజేపీకి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.. నా టెర్మ్ లో కృష్ణా గోదావ‌రి పుష్క‌రాలు వ‌చ్చాయ‌ని ఎండోమెంట్ త‌ర‌పున తాము అధికారుల క‌ష్ట‌ప‌డ్డామ‌ని అన్నారు.. మొత్తానికి ఇటు న‌లుగురు మంత్రులు రాజీనామాలు చేసిన‌ట్టే అక్క‌డ టీడీపీకి ఇద్ద‌రు ఇక్క‌డ బీజేపీ ఇద్ద‌రు లెక్క అలా తేలింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.