ఏపీ బీజేపీ ర‌థ‌సార‌ధి రెడీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

bjp image
Updated:  2018-03-28 04:29:39

ఏపీ బీజేపీ ర‌థ‌సార‌ధి రెడీ

ఏపీ రాజ‌కీయాల్లో   కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీలు త‌మ ప్రాబ‌ల్యాన్ని చాటుకోవ‌డానికి వ్యూహాలు ర‌చించుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్నిక‌ల్లో నాయ‌కుల బ‌లా బ‌లాల‌ను, ప‌రిపాల‌నా విధానాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌భుత్వాన్ని ఎన్నుకుంటారు ప్ర‌జ‌లు.
 
రాష్ట్రంలో రాజ‌కీయంగా టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, కాంగ్రెస్‌ ప్ర‌ధాన పార్టీలుగా ఉన్నాయి. అయితే ఇక్క‌డ ప్రాంతీయ పార్టీలకు స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌కులు ఉన్న విషయం తెలిసిందే. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు పీసీసీ అధ్య‌క్షులుగా ర‌ఘువీరా రెడ్డి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీకి  ఏపీ అధ్యక్షుడిగా ఎంపీ హరిబాబు కొన‌సాగుతున్నారు. అయితే ఆయ‌న నాయ‌క‌త్వంలో బీజేపీ ఎదుగుద‌ల లేదు అని ఆయ‌న స్ధానాన్ని వేరేఒక‌రితో భ‌ర్తీ చేయాలి అని బీజేపీ నాయ‌కులు సూచిస్తున్నారు.
 
ఇప్ప‌టికే  దీని పై దృష్టి సారించింది బీజేపీ అధినాయ‌క‌త్వం. గ‌త కోంత కాలంగా ఏపీకి విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, ప్ర‌త్యేక‌హోదా లాంటి విష‌యాల పై కేంద్రం నిర్ల‌క్ష్యం వహించి ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తుంద‌ని టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.
 
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ల‌బ్దిపొంద‌డానికి  మైత్రి బంధాన్ని  సైతం వ‌దులుకుంది. బీజేపీని ప్ర‌జ‌ల్లో దోషిని చేయ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తుంటే. దీనిని పూర్తి స్థాయిలో తిప్పికోట్టారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అందులో భాగంగానే టీడీపీ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని, వైఫ‌ల్యాల‌ను పెద్ద ఎత్తున బ‌హిష్కృతం చేశారు. సీఎం చంద్ర‌బాబును లెక్క చేయ‌కుండా ప‌దునైన మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు సోము వీర్రాజు. ఈ నేప‌థ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కొత్త వ్య‌క్తుల‌కు అప్ప‌గించాల‌ని బీజేపీ అధినాయ‌క‌త్వం యోచిస్తోంది.
 
ఏపీ బీజేపీ అధ్య‌క్ష రేసులో అందరికన్నా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముందున్నారని వినిపిస్తోంది. సోము వీర్రాజు పేరు ఖరారయ్యిందని, త్వరలోనే ఆయన పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. మరో వారం రోజుల్లో సోము వీర్రాజు అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటన వెలువడుతుందని ఆయన స‌న్నిహితులు చెబుతున్నారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, బీజేపీ హైక‌మాండ్ కు  ఎప్పటికప్పుడు వాస్తవాలను నివేదించడంలో సోము వీర్రాజు చాలా చురుకుగా వ్యవహరించారని, అందుకే ఆయన జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారని వినిపిస్తోంది. వాస్తవానికి గతంలోనే సోము వీర్రాజు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. అయితే అప్పట్లో వెంకయ్యనాయుడు హవా బాగా నడుస్తుండడంతో వీర్రాజుకు అవకాశం దూరమయ్యింది. ఇక ఎన్డీయే నుంచి టీడీపీ దూరం కావడంతో ఏపీలో టీడీపీని ఎదుర్కోవడానికి, వాస్తవాలను వివరిస్తూ ఎదురుదాడి చేయడానికి సోము వీర్రాజును మించిన నాయకుడు లేడని పార్టీ అధిష్టానం భావిస్తోందని సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.