16 న ఏపీ బంద్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

april 16th ap bundh
Updated:  2018-04-12 02:53:54

16 న ఏపీ బంద్

ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధ‌నే ల‌క్ష్యంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న‌లు ధ‌ర్నాలు రైల్ రోకోలు శాంతియుతంగా నిర్విహిస్తున్న విష‌యం తెలిసిందే.....  ఇక దిల్లీలో ఆరు రోజుల పాటు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేశారు వైసీపీ ఎంపీలు.. అయితే వారి ఆరోగ్యం విష‌మించ‌డంతో వైసీపీ ఎంపీల‌ను బ‌లవంతంగా పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
ఇక ఈ స‌మ‌యంలో ప్ర‌త్యేక హూదా పోరు ప‌తాక స్ధాయికి చేరుకుంది....ఈనెల 16వ తేదీన ఏపీ బంద్‌కు వామపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈమేరకు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు.
 
ఈ నెల 16వతేదీన బంద్‌కు పిలుపునిస్తున్నామని, అయితే... అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపునిస్తున్నామని తెలియ‌చేశారు.... అలాగే బంద్‌లు చేయాలని మా‌కు కోరిక కాదు... ప్రజల కోసం రోడ్డెక్కుతున్నాం అని ఆయ‌న తెలియ‌చేశారు.. ఏపీకి ప్ర‌త్యేక హూదా పోరాటంలో తాము ఎందాకైనా వెళ‌తాం అని తెలియ‌చేశారు ఆయ‌న‌..
 
పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీక్ష ఉందన్నారు. ప్రజలంతా‌ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని లెఫ్ట్, హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఇప్ప‌టికే సీపీఐ సీపీఎం మ‌ద్ద‌తు ఇచ్చింది ఈ బంద్ కు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.