ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 04:59:13

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు....

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న అమ‌రావ‌తిలో జ‌రిగిన రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప‌లు  సంస్ధ‌ల‌కు భూ కేటాయింపుల‌తో పాటు బ‌డ్జెట్  స‌మావేశాల‌పై చ‌ర్చించారు.
 
1. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 2017 నుండి 2018 మార్చి 31 వ‌ర‌కు 2.096 శాతం డిఏ చెల్లించాల‌ని నిర్ణ‌యం...
2. స్పీక‌ర్ కోసం పీఆర్వో పోస్టును సృష్టిస్తూ ఆమోదం
3. మార్చి 5న బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం
4. పోల‌వ‌రం ప్రాజెక్టులో కాంక్రిట్ ప‌నులు చేప‌ట్టిన న‌వ‌యుగ సంస్థ‌కు రూ.1,244 కోట్ల ప‌రిపాల‌న అనుమతుల‌కు ఆమోద ముద్ర‌.
5.ధ‌రల స్ధిరీక‌ర‌ణ నిధి కోసం ఆ బడ్జెట్ లో రూ 500 కోట్ల‌ను మంత్రి సోమిరెడ్డి అంగీక‌రించిన సీఎం 
6. ఏపీ ఎక‌నామిక్ డెవ‌లెప్ మెంట్ బోర్డు స్వ‌యంప్రతిప‌త్తి డ్రాప్ట్ బిల్లు ఆమోదం
7. విశాఖ, తిరుప‌తిలో ఫ్యామిలీ ఎంట‌ర్ టైన్ మెంట్ సెంట‌ర్ల ఏర్పాటు 
8. అవినీతి నిరోధక శాఖలో 350 పోస్టులు, గన్నవరం కోర్టులో 25 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం
9. విజ‌య‌వాడ విద్యాధ‌రపురంలో ఉర్దూ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం
10.శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్ధలం మండ‌లం సంచాంలో ఇండస్ట్రియ‌ల్ పార్కుకు 44.97 ఎకరాల భూమిని ఏపిఐఐసీకి కేటాయింస్తూ ఆమోదం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.