రాజీనామాలిచ్చేశారు....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ashok gajapathi raju and sujana chowdary image
Updated:  2018-03-08 06:49:34

రాజీనామాలిచ్చేశారు....

ఏపీలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగింది.. హ‌స్తిన‌లో కూడా ఏపీ రాజ‌కీయం స‌రికొత్త రూటు చూపింది. ఇక ఏపీకి ప్ర‌త్యేక హూదా పై కేంద్రం ప్ర‌క‌ట‌న చేయ‌డంతో తెలుగుదేశం స‌ర్కార్ కేంద్రం నుంచి త‌న మంత్రుల‌ను వైదొల‌గాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. 
 
కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయిన ఇద్దరు రాజీనామాలు సమర్పించారు.  పౌర విమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు..  అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా సుజనా చౌదరి ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్ర మంత్రులుగా కొన‌సాగారు.
 
2014 మే 26న మంత్రిగా అశోక్ గజపతిరాజు, నవంబర్ 9న సుజనా చౌదరి ఆ ఏడాదే బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈ ఇద్దరూ మోదీని కలవడానికి వెళ్లినప్పుడు తమ సొంత వాహనాల్లో వెళ్లడం ఇక్క‌డ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఏపీలో తాజా ప‌రిస్దితిని వివ‌రించి తాము రాజీనామా స‌మ‌ర్పించామ‌ని తెలిపారు.. దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఎటువంటి స్పంద‌న చూప‌లేదు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.