దేశంలో ధ‌నిక సీఎం బాబే...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-13 12:36:52

దేశంలో ధ‌నిక సీఎం బాబే...

భార‌త దేశంలో ఉన్న‌ 31 మంది ముఖ్య‌మంత్రుల ఆస్తుల‌కు సంబంధించి ఒక నివేదిక‌ను విడుద‌ల‌ను చేసింది అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్(ఏడిఆర్) ... ఈ నివేదిక‌లో సుమారు 80 శాతం మంది సీఎంలు కోటీశ్వ‌రులుగా ఉన్నార‌ని ఆ సంస్ధ తెలిపింది... వీరిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రూ.177 కోట్ల‌కు పైగా ఆస్తులు ఉండ‌డంతో దేశంలో ధ‌నిక సీఎంగా మొద‌టి స్ధానంలో నిలిచారు... 
 
ఆ త‌ర్వాత  అరుణాచ‌ల్ ముఖ్య‌మంత్రి పెమ‌ఖండూ రూ.129 కోట్లు ఆస్తులు ఉండ‌డంతో రెండ‌వ స్థానంలో ఉండ‌గా, పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ రూ.48 కోట్ల‌తో మూడో స్థానంలో నిలిచారు... అతి త‌క్కువ ఆస్తులున్న‌వారి జాబితాలో త్రిపుర ముఖ్య‌మంత్రి మాణిక్ స‌ర్కార్ రూ.26 ల‌క్ష‌ల ఆస్తులు క‌లిగి ఉన్నారు... ఇక‌ మ‌మ‌తా బెన‌ర్జీ రూ.30 ల‌క్ష‌లు, మెబూబా ముఫ్తీ రూ.55 ల‌క్ష‌ల ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లు  ఏడీఆర్ పేర్కొంది .. 
 
అంతే కాకుండా  దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్య‌మంత్రుల విద్యాభ్యాసం, క్రిమిన‌ల్ కేసుల గురించి ఏడీఆర్ నివేదిక ప్ర‌క‌టించింది..ఈ నివేదిక  ప్ర‌కారం... 31 ముఖ్య‌మంత్రుల్లో సుమారు 11 మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని  తేలింది... ఇందులో మ‌హారాష్ట్ర సీఎం పై 22 కేసులు, కేర‌ళ సీఎం పై 11, అర‌వింద్ కేజ్రీవాల్ పై 10, చంద్ర‌బాబు పై 3  కేసులు ఉన్న‌ట్లు నివేదిక‌లో పేర్కొంది.
 
ఇక‌ విద్యార్హతల విషయానికి వస్తే..మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది ఇంటర్మీడియ‌ట్  పూర్తి చేయ‌గా, 39 శాతం మంది డిగ్రీ ప‌ట్టాల‌ను పొందారు... అలాగే  32 శాతం మంది వృత్తి విద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్‌ సాధించినట్లు  ఏడిఆర్ త‌న నివేదికలో  పేర్కొంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.