నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-21 16:23:35

నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు...

ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని 2014 ఎన్నికల్లో సుమారు 600 పైగా హామీలు ప్ర‌క‌టించి అధికారాన్ని దక్కించుకున్నారు చంద్రబాబు...అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావ‌స్తున్నా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు ముఖ్య‌మంత్రి...రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా రుణాలు మాఫీ పేరుతో మహిళలను, జాబు రావాలంటే బాబు రావాలి అని, ఒకవేళ జాబు రాకపోతే నెలకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి నిరుద్యోగులను మభ్యపెట్టారు...ఉచిత లాప్ టాప్ అని చెప్పి విద్యార్థులను, ప్రతీ మహిళకు స్మార్ట్ ఫోన్, మీ భద్రతకు నేను తోడు ఉంటాను అని టీడీపీ నేతలే మహిళలని కించపరుస్తున్నారు ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని మభ్యపెట్టేలా ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలోకి తొక్కారు బాబు...
 
టీడీపీ ఇచ్చిన హామీలను ఎలాగో అమలుచేయలేదు...కనీసం మనకు రావాల్సిన విభజన చట్టంలోని హామీలను ఏమైనా సాదించుకున్నారా! అంటే అదీ లేదు...టీడీపీ నాలుగేళ్ళ పాటు కేంద్ర ప్రభుత్వంతో మిత్ర పక్షంగా ఉండి కూడా ఒక్కసారి కూడా విభజన హామీలను అమలు చేయమని అడగకుండా మభ్యపడుతున్నారు...నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కై విభజన హామీలను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టారని తెలుస్తోంది.
 
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పి 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదాని తీసుకువస్తాని అని చెప్పి అధికారాన్ని దక్కించుకుంది టీడీపీ... ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాకుండా, హోదా ఏమైనా సంజీవన, హోదా గురించి మాట్లాడితే జైలుకే, హోదా వస్తే ఏమొస్తుంది, హోదా కంటే ప్యాకేజీనే గొప్పది అని పూటకో మాట చెప్పారు...
 
హోదాపై ప్రతిపక్ష నేత పోరాటంతో  ప్రత్యేక హోదా నినాదం ప్రజల్లోకి వెళ్లడంతో, బాబు మళ్లీ యూటర్న్  తీసుకుని ప్రత్యేక హోదాకి జై కొట్టారు... ప్రతిపక్షం అవిశ్వాసం అంటే రాష్ట్ర ప్రయోజనాలకోసం ఆలోచించకుండా నీచ రాజకీయాల కోసం మేము అవిశ్వాస తీర్మానం అన్నారు..
 
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న అని డ్రామా ఆడుతున్నావు తప్ప, పోరాటం మాత్రం చేయరు...ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాము అని చెప్పి, అవిశ్వాస తీర్మానం చర్చకు రానివ్వకుండా మీ ఎంపీల చేతే పార్లమెంట్లో గొడవ చేపిస్తారు... పార్లమెంట్లో సభ సజావుగా లేకుంటే చర్చ రాదు అనే విషయం 40 ఏళ్ల అనుభవం ఉన్న బాబుకు తెలియదా?. కేవలం ఓటుకు నోటుకు బయపడి తన స్వప్రయోజనల కోసం రాష్ట్రా భవిష్యత్తును తాకట్టు పెట్టారు.. అధికారం కోసం, స్వప్రయోజనాల కోసం ఇన్ని నీచ రాజకీయాలు అవసరమా అంటూ ప్రజలు తిట్టుకుంటున్నారు చంద్రబాబును...
 
చంద్ర‌బాబు ఇచ్చిన హామీల నుండి విభ‌జ‌న చట్టంలోని హామీలు, అలాగే ప్ర‌త్యేక హోదా వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ మ‌భ్య‌పెడుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను గాలికి వ‌దిలేస్తున్నారని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.