ఉగాది నాడు బాబు కొత్త ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-15 15:54:35

ఉగాది నాడు బాబు కొత్త ఆఫ‌ర్

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారాచంద్ర‌బాబు తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా (ఉగాది పండుగ) రోజు నాడు ఒక కొత్త ప‌నికి శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది... ఉగాది పండుగ పుర‌స్క‌రించుకుని ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను అప్ప‌గించ‌నున్నారు.
 
దీంతో పాటు గ‌తంలో మంత్రి ప‌ద‌వులు అప్ప‌గించిన వారిలో  ప‌ద‌వీ భాద్య‌త‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌ని వారిని తోల‌గించి, వారి స్థానంలో కొత్త వారికి ప‌ద‌వులు అప్ప‌గించ‌నున్నారు అని చ‌ర్చించుకుంటున్నారు.. కాగా ఇప్ప‌టికే కేంద్రం బీజేపీ మంత్రుల రాజీనామాల‌తో ఖాళీ అయిన స్థానాల‌ను కూడా ముఖ్య‌మంత్రి భ‌ర్తీ చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది... అయితే ఈ క్ర‌మంలో ఈ ప‌ద‌వుల కోసం ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్న నాయ‌కులు, త‌మ‌కు ముఖ్య‌మంత్రి ఏ ప‌ద‌విని అప్ప‌గిస్తారో అని టీడీపీ నాయ‌కులు ఎదురుచూస్తున్నారు...
 
కేవ‌లం నామినేటెడ్ ప‌ద‌వులు,మంత్రి ప‌ద‌వులే కాకుండా రాష్ట్ర‌ వ్యాప్తంగా అనేక చోట్ల పెండింగ్ లో ఉన్న మార్కెట్ యార్డ్ పాల‌క మండ‌లి ప‌ద‌వుల‌ను చంద్ర‌బాబు భ‌ర్తీ చేసే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది... అదే విధంగా ఉగాది రోజున ప్రజలకు కూడా ఉపయోగపడేలా ఓ కొత్త పథకాన్ని చంద్రబాబు ప్రకటిస్తున్నట్లు తెలుగుదేశం నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.
 
అయితే ఈ నేప‌థ్యంలో  ఒక వైపు టీడీపీ నాయ‌కులు త‌మ‌కు చంద్ర‌బాబు ఏ ప‌ద‌వులు అప్ప‌గిస్తారో న‌నిఎదురుచూస్తుండ‌గా... మ‌రో వైపు ప‌ద‌వుల‌కోస‌మే ప‌నిచేస్తున్న టీడీపీ నాయ‌కులుల‌కు ఉగాది పండుగ రోజు ముఖ్య‌మంత్రి వారికి మంత్రి ప‌ద‌వులు ప్ర‌క‌టించ‌క‌పోతే  వారు పార్టీ నుంచి వైదోలిగేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.