కేంద్రానికి డిమాండ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 05:26:35

కేంద్రానికి డిమాండ్

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు స్పందించారు. గుంటూరు జిల్లా కోట‌ప్పకొండ‌లో  నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్ర‌బాబు..... రాష్ట్ర అభివృద్ది కోసం అనేక సార్లు దిల్లీ వెళ్లిన విష‌యాన్ని గుర్తు  చేశారు. విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకుంటార‌నే న‌మ్మ‌కంతోనే గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తి ఇచ్చిన‌ట్లు తెలియ‌జేశారు.
 
చివ‌రి వ‌ర‌కు న్యాయం చేస్తుంద‌ని వేచి చూసినా కూడా కేంద్రం అన్యాయమే చేసింద‌ని అని అన్నారు.  చివ‌రి బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన‌ నిధులు చాలా దారుణంగా ఉన్నాయ‌ని, ఇత‌ర రాష్ట్రాల మాదిరిగానే ఏపీ కూడా అభివృద్ది చెందే వ‌ర‌కు చేయూత‌ని ఇవ్వాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంద‌ని అన్నారు. 
 
విభజన చట్టంలో ఉన్న అంశాల‌ను అమ‌లు చేయాల్సిందేన‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు చంద్ర‌బాబు. అయితే హోదా కోసం తెర‌పైకి వ‌చ్చిన రాజీనామా అంశాల‌పై మాత్రం  చంద్ర‌బాబు  స్పందించ‌లేదు. మ‌రి రానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో టీడీపీ ఎలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటుందో చూడాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.