ముహూర్తం ఫిక్స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 12:05:58

ముహూర్తం ఫిక్స్ ?

ఏపీలో ఇంకా సంవ‌త్స‌రం సార్వ‌త్రిక ఎన్నిక‌లకు స‌మ‌యం ఉన్నా ఇప్పుడే పొలిటిక‌ల్ హీట్ క‌నిపిస్తోంది..మ‌రీ ముఖ్యంగా ఏపీలో క‌ర్నాట‌క ఎన్నిక‌ల  త‌ర్వాత ఎటువంటి పొలిటిక‌ల్ స్కెచ్ కేంద్రం అమ‌లు చేయ‌బోతోందో అనేది ఇప్పుడు ఇక్క‌డ పెద్ద చ‌ర్చ‌గా సాగుతోంది.. మ‌రో ప‌క్క కోటి మంది తెలుగువారు ఉన్న క‌ర్నాట‌క‌లో ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించాలి అని అలాగే కాంగ్రేస్ మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టాలి అని చూస్తోంది... అయితే ఈ ఎన్నిక‌ల త‌ర్వాత కేంద్రం ఏపీ పై ఎటువంటి స్ట్రాట‌జీ అమ‌లు చేసినా చేయ‌క‌పోయినా సీఎం చంద్ర‌బాబు మాత్రం, కొత్త పందా తీసుకోనున్నారు అని అంటున్న‌రు, తెలుగుదేశం సీనియ‌ర్లు.
 
అవును బీజేపీకి రెండు మంత్రి ప‌ద‌వులు ఇచ్చి ప‌క్క‌న కేబినెట్లో కూర్చొబెట్టుకున్నారు, ఇక ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి ప‌ద‌వుల‌కు ఇద్ద‌రు రాజీనామా చేశారు... ఇటు రాష్ట్రంలో కూడా ఇద్ద‌రు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు... అయితే చంద్ర‌బాబు తాజాగా కేబినెట్ విస్త‌ర‌ణ చేయాలి అని భావిస్తున్నారు అని తెలుస్తోంది..రెండు నెల‌లు అయినా వారి స్ధానాలు భ‌ర్తీ కాలేదు..
 
కొత్త‌వారికి శాఖ‌లు ఇవ్వాలి అని అనుకుంటున్నారు... అలాగే కొత్త‌వారికి కూడా ఈసారి అవ‌కాశం ఇవ్వాలి అని చంద్ర‌బాబు భావిస్తున్నారు పార్టీలో, వ‌చ్చే  ఎన్నిక‌ల‌కు ఫైన‌ల్ గా ఈ మంత్రులతో ముందుకు వెళ్లాలి అని చూస్తున్నారు.. మ‌రో ఇద్ద‌రు యువ ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇస్తారు అని తెలుస్తోంది అమ‌రావ‌తి పొలిటిక‌ల్ ఏరియాలో అయితే క‌మ్మ కాపు సామాజిక‌వర్గానికి చెందిన వారు ఇరువురు బీజేపీ మంత్రులు రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు అదే సామాజికి వ‌ర్గానికి మ‌రోసారి అవ‌కాశం ఇస్తారు అని అంటున్నారు...
 
పార్టీలో మైనార్టీల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేదు అని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి... కాబ‌ట్టి మైనార్టీకి కూడా అవ‌కాశం ఇవ్వ‌చ్చు అని అంటున్నారు కొంద‌రు మేధావులు... ఈ నెల 15 లేదా 19 న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంది అని అంటున్నారు కొంద‌రు సీనియ‌ర్లు. మ‌రి చూడాలి కొత్త వ్య‌క్తులు వ‌స్తారా, లేదా పాత మంత్రుల శాఖ‌లు మార‌తాయా అనేది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.