రైతులను మోసం చేసిన చంద్రబాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 18:30:01

రైతులను మోసం చేసిన చంద్రబాబు

శనివారం రాత్రి ఈదురు గాలులతో రాజంపేట నియోజకవర్గము ఒంటిమిట్ట, నందలూరు, మండలలో ఉద్యాన పంటలు అయిన మామిడి, అరటి, బొప్పాయి దెబ్బతిన్నాయి.. నష్ట పోయిన పంటలను రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక నెలలోనే మూడు సార్లు వీచిన గాలులు రైతన్నలను కోలుకుని విధంగా దెబ్బతీసింది..మామిడి కాయలు నేల రాలిపోవడమే కాకుండా చెట్లు నేల కూలడం చాలా బాధ అనిపిస్తుంది అని అన్నారు. ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లో విఫలమైంది. 
 
ఇప్పుడు మూడు సార్లు గాలులకు దెబ్బ తిన్న పట్టలకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదు, తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అయన చంద్రబాబు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు..రైతు రుణమాఫీ చేస్తానని ఒకసారి రైతులను మోసం చేసిన చంద్రబాబు...ఇప్పుడు నష్టపరిహారం చెల్లించకుండా మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.