చంద్ర‌బాబు మాట విని ల‌బోదిబో అంటున్నాం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-10 15:13:27

చంద్ర‌బాబు మాట విని ల‌బోదిబో అంటున్నాం

కృష్ణా డెల్టాలో బంగారు పంట‌లు పండే పంట‌ల‌న్ని ప్ర‌స్తుతం బీడు భూములుగా మారుతున్నాయి. ఎక్క‌డ చూసిన క‌లుపు మొక్కలే క‌నిపిస్తున్నాయి. ప‌క్క‌నే కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నా జీవజ‌లం లేక భూములు బీళ్లుగా మారుతున్నాయి. కృష్ణా జిల్లాలో ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఇలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది. ప్ర‌కాశం బ్యారెజ్ నుంచి తూర్పు ప‌శ్చిమ డెల్డా కాలువ‌ల‌కు గ‌త జూన్ మూడ‌వ వారంలో టీడీపీ స‌ర్కార్ సాగు నీటిను విడుద‌ల చేసింది. 
 
చంద్ర‌బాబు నాయుడు ఎంతో ఆర్భాటంగా సాగునీటి విడుద‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌ట్టిసీమ ఎత్తిపోతల‌ ప‌థ‌కాన్ని పూర్తి చేసింద‌ని గోదావ‌రి జ‌లాల‌ను కృష్ణాన‌దికి అనుసందానం చేశామంటూ టీడీపీ నాయ‌కులు గొప్ప‌లు చెప్పారు. సార్వా పంట‌ను అదును త‌ప్ప‌కుండా వేసుకునేందుకు స‌కాలంలో ప‌ట్టిసీమ నీటిని ప్ర‌కాశం బ్యారెజ్ కు తీసుకువ‌చ్చి కృష్ణా డెల్టాకు స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని టీడీపీ నాయ‌కులు గ‌ర్వంగా ప్ర‌క‌టించారు. 
 
అంత‌టితో ఆగ‌కుండా జిల్లాలోని అన్ని మండ‌లాల‌కు పట్టిసీమ నీరు వ‌చ్చేస్తోంది. రైతులు సార్వాకు సిద్దం కావాలంటూ ప్ర‌భుత్వ అధికారుల‌తో ప్ర‌చారం కూడా చేయించారు. ఇక టీడీపీ నాయ‌కులు ఆర్భాటాల‌ను చూసిన రైతులు కాస్త అనుమానంతో వ‌రి నారుమ‌ళ్లు పోశారు. అదిగో ఇదిగో ప‌ట్టిసీమ నీరు అంటూ అధికార‌లు సైతం రైతుల‌ను మున‌గ చెట్టు ఎక్కించారు. చివ‌ర‌కు ప్ర‌భుత్వం మాట‌ల‌ను న‌మ్మి వ‌రినారు పోసుకున్న డెల్టా సివారు రైతులు నిలువునా మునిగిపోయారు. నారుమ‌ళ్ల కోసం ఇప్ప‌టికే సుమారు రెండువేల రూపాయ‌ల‌కు వ‌ర‌కు ఖ‌ర్చు కూడా చేశారు. 
 
కానీ కాలువ‌ల్లో చుక్క నీరు క‌నిపించ‌క‌పోవ‌డంతో రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక చేసేది ఏం లేక వేసిన నారుమ‌ళ్ల‌ను ద‌క్కించుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ఇటీవ‌లే కురిసిన వ‌ర్షాల‌కు కాలువ‌ల్లో చేరిన నీటిని రెక్క‌లు ముక్క‌ల‌య్యేలా పంట‌ను కాపాడు కునేందుకు బ‌కెట్ల‌తో నీటిని తోడుకుంటున్నారు. డెల్టా చివ‌రి భూములుగా ఉన్న పెడ‌నా, కైకలూరు, మ‌చిలీప‌ట్నం అవ‌నిగ‌డ్డ, గ‌న్నవ‌రం, బ‌పుల‌పాడు త‌దిత‌ర మండ‌లాల్లోని వేలాది ఎక‌రాల్లో నేటికి వ్య‌వ‌సాయ ప‌నులు ప్రారంభం కాలేదు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.