రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన సమాధానాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 16:24:57

రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన సమాధానాలు

రాజకీయాలలో నాకు నలభై ఏళ్ల అనుభవం ఉంది. దేశంలోనే నా అంత సీనియర్ పొలిటీషన్ ఎవరు లేరు. 95 /96 లోనే ప్రధాన మంత్రి పదవిని వదిలేసిన త్యాగ శీలిని. నేను నిప్పు అని ఎప్పుడు రాష్ట్ర ప్రజలకు చెప్తూ ఉంటారు, దేశంలో కేంద్రాన్ని నేను తప్ప ఎవరు వణికించలేదు, అప్పట్లోనే కేంద్రంలో చక్రం తిప్పాను అంటారు. నేను మాట్లాడితే ఢిల్లీ గజగజ వణుకుద్ది అంటారు ఆయనే చంద్రబాబు నాయుడు.
 
నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, అవినీతిపైనా ప్రతిపక్షాలు, వామపక్షాలు, మొన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళు చేస్తున్న విమర్శలపైనా టీడీపీ ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రజలకు  ఉన్న అనుమానాలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.టీడీపీ ప్రభుత్వం - చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రజలు కోరుకుంటున్న కొన్ని అంశాలు...
 
1. పట్టి సీమలో అవినీతి జరిగింది అని ప్రతిపక్ష నేతలు, మేధావులు చివరకు కాగ్ కూడా చెప్తున్నా దాని పైన చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు.
 
2. పోలవరం ప్రాజెక్ట్ ను కేవలం కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.పోలవరంలో టెండర్ల విషయం నుంచి అన్ని విషయాలలోనూ అవినీతి ఎక్కువ జరిగింది అని ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రతిపక్ష పార్టీలు,వామపక్షాలు చెప్తున్నా దాని పైన విచారణ చేయకుండా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు...
 
3. ఇసుక నుండి మట్టి వరకు ప్రతి దాంట్లోనూ మీ కొడుకు అవినీతికి పాల్పడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపణులు చేస్తే, మీ కొడుకు గాని, మీరు కానీ ఎందుకు సమాధానం చెప్పలేదు.
 
4. నోట్ల రద్దు అప్పుడు కొత్త నోట్లతో పట్టుపడిన శేఖర్ తో లోకేష్ కి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తే దాని పైన ఎందుకు స్పందించలేదు.అంటే ప్రజలు వాళ్ళిద్దరికీ సంబంధాలు ఉన్నాయనే అనుకోవాలా?
 
5. మహిళలపైన దారుణాలు, హత్యాచారాలు రోజుకు ఒకటి జరుగుతుంటే, అది కూడా రాజధాని ప్రాంతంలో జరుగుతుంటే ఎందుకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు, వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఎందుకంటే ఈ అఘాయిత్యాలకు టీడీపీ కార్యకర్తలే పాల్ప‌డుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి అందుకేనా?
 
6. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో టీడీపీ లో ఉన్న పెద్ద నాయకుల హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వాటిపైన ఎందుకు సమాధానం చెప్పలేదు.
 
7. నేను నిప్పు, నేను ఏ తప్పు చేయను అని అంటారు, ఏ తప్పు చేయకపోతే 18 కేసులలో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు.
 
8. మీరు నిప్పు అయితే. నా పైన కుట్ర జరుగుతుంది, నన్ను జైలుకు పంపిస్తారు నాకు వలయంలా మీరు ఉండాలి అన్నారు.మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు అంత భయం.
 
9. ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ మీదే అని అందరు అంటున్నారు.మీది కానప్పుడు దాని పైన విచారణకు ఎందుకు ఆదేశించలేదు.
 
10. కేంద్రాన్ని వణికించా అని చెప్పే మీరు ఓటుకు నోటు ఇవ్వడం తప్పు అని తెలియదా? ఆడియో, వీడియో టేపులతో మీ ఎమ్మెల్యే దొరికితే ఎలాంటి చర్యలు తీసుకోరా?
 
11. మీ ఎమ్మెల్యేలు మహిళలను కొడితే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు ఉండవా?
 
12. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు దళితులపైనా అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా?
 
13. అమరావతి నిర్మాణానికి కేంద్రం 2000 వేల కోట్ల రూపాయలు ఇస్తే, కేవలం 700 కోట్లు ఖర్చుపెట్టారు.. మిగిలిన డబ్బంతా ఏమి చేశారు? 
 
14. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయలకు లెక్కలను చెప్పమంటే ఎందుకు చెప్పలేదు.
 
15. ఒక సంవత్సర కాలంలోనే మూడు సార్లు బోటు ప్రమాదం జరిగితే, ఇంత వరకు విచారణ జరిపించలేదు. ఎందుకు?
 
16. పుష్కరాలలో సుమారు 22 మంది చనిపోతే ఇప్పటివరకు దానిపైన ఊసే లేదు ఎందుకు?   
 
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.