దిగొచ్చిన బాబు అనుకూల మీడియా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-19 16:22:31

దిగొచ్చిన బాబు అనుకూల మీడియా

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర రాజ‌కీయం కోసం కాకుండా ప్రజల కోసమే అని తెలియడంతో   ప్రజలు జగన్ ని ఆరాధిస్తున్నారు.. జగన్ పై ప్రజలకు భరోసా పెరిగింది...జగన్ మోహన్ రెడ్డి అయితేనే వాళ్ళ నాన్న మాదిరిగా నీతి, నిజాయితీగా ప్రజలకు ఏదైనా చేయగలడు అని ప్రజలు భావించారు...
 
అందుకే జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లుపెట్టి ఆరు నెలలు గడిచిపోయినా జగన్ వెన్నంటే ఉన్నారు ప్రజలు... ఆరు నెలలపాటు 8 జిల్లాల్లో పాదయాత్ర చేశారు జగన్..పాద‌యాత్ర‌లో జగన్ చూపిస్తున్న ప్రేమాభిమానాలతో ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గుర్తుకువస్తున్నారు.. అందుకే జగన్ ఏ జిల్లాలో అడుగుపెట్టిన ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెల్లువలా వస్తున్నారు...
 
జ‌గ‌న్ అన్ని మీడియా హౌస్ ల‌ అధినేత‌ల‌తో పాద‌యాత్ర‌కు ముందు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు... త‌న పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, ఉన్న‌ది ఉన్న‌ట్లు చూపించినా చాలని జ‌గ‌న్ పలువురు మీడియా అధినేత‌ల‌తో మాట్లాడారు. కానీ పచ్చ ఛానళ్ళు అరకొర బులెటన్ లో తప్ప, జ‌గ‌న్ పాద‌యాత్రకు స‌రైన ప్రాధాన్య‌త క‌ల్పించ‌లేదు..
 
కానీ జగన్ కి ప్రజలు తెలుపుతున్న మద్దతుని చూసి టీడీపీ నాయకులు,  టీడీపీ అనుకూల మీడియా కూడా బెంబేలెత్తిపోతున్నాయి... ఈ జనసంద్రోహాన్ని చూసి తట్టుకోలేక 2019 పరిస్థితిపై ఏ పచ్చ ఛానల్ సర్వే నిర్వచించిన, వచ్చే ఎన్నికలలో ప్రజలు జగన్ కి ప‌ట్టం కడతారని తెలిసింది..అందుకే జగన్ కి దగ్గరవడానికి తెలుగుదేశం అనుకూల మీడియాలు కూడా రానున్న రోజుల్లో జగన్ కి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తునట్లు సమాచారం...మొత్తానికి జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న మ‌ద్ద‌తును చూసి ఆ మీడియా హౌస్ లు కూడా ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నాయి అంటున్నారు మేధావులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.