వైసీపీకి జోష్ ను ఇచ్చే వార్త‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-02 16:14:32

వైసీపీకి జోష్ ను ఇచ్చే వార్త‌

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప‌ట్టు ప్ర‌జ‌ల‌లో ఉందా లేదా, తాము మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామా లేదా అన్న అంశాల‌పై సర్వేలు నిర్వ‌హించారు చంద్ర‌బాబు. అయితే ఈ సర్వే తెలిపిన ప్ర‌కారం నెక్ట్స్ టీడీపీ ప్ర‌భుత్వం రావ‌డం కష్ట‌త‌రంతో కూడుకున్న ప‌ని అని తెలిపింది. ఇక ఈ స‌ర్వేలు త‌ప్పు చెప్పాయో ఏమో తెలియ‌దు కానీ త‌న ద‌గ్గ‌ర ఉన్న చివ‌రి అస్త్రాన్ని ఉప‌యోగించార‌ట‌ చంద్ర‌బాబు నాయుడు.
 
ఈ చివ‌రి అస్త్రం ఏంటా అని చూస్తున్నారా, అదేనండి మ‌న ముఖ్య‌మంత్రి ప్ర‌తీ సారి టెక్నాల‌జిని ఉప‌యోగిస్తారు క‌దా అయితే ఈ సారి కూడా త‌న చివ‌రి అస్త్రానికి టెక్నాల‌జిని ఉప‌యోగించి రాష్ట్రంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికి స్వయంగా కాల్ చేసి టీడీపీ ప్ర‌భుత్వంపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నార‌ట‌. ఇందులో ముఖ్యంగా..
 
2014 లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ ప‌రిపాల‌న ఎలావుంద‌ని, ఎంత‌మేర‌కు గ్రామాలు అభివృద్ది జ‌రిగాయ‌ని, టీడీపీ సంక్షేమ‌ ప‌థ‌కాలు పై మీ అభిప్రాయం ఏంటి, ఈ ప‌రిపాల‌న‌ చూసి మ‌ళ్లీ మీరు 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటు వేయాల‌నుకుంటున్నారా అని చంద్ర‌బాబు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నార‌ట‌. అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి మీరు ఓటు వేయాల‌నుకుంటున్నారా అని  ప్ర‌జ‌లను అడిగి తెలుసుకుంటున్నార‌ట‌. అయితే ప్ర‌జ‌లు ఓటా.. అప్పుడు చూస్తాం అని చెబుతున్నార‌ట‌.
 
ఇక‌ మ‌రీ ముఖ్యంగా నాలుగు సంవ‌త్స‌రాల నుంచి టీడీపీ త‌ర‌పున లాబ‌ప‌డిన వారు కూడా టీడీపీకి ఓటు వేయ‌మ‌ని అడిగేతే అప్పుడు క‌దా చూస్తాములే అని సేమ్ అదే స‌మాధానం చంద్ర‌బాబుకు ఫోన్ లో చెబుతున్నార‌ట‌. దీంతో ప్ర‌జ‌ల నుంచి టీడీపీకి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ చూసి చంద్ర‌బాబు టెన్ష‌న్ టెన్ష‌న్ గా ఉన్నారు. 
 
అయితే ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపుపై అనుమానాలు ఉన్నాయ‌ని స్వ‌యానా ఆయ‌నే చెప్పారు. అస‌లే టీడీపీకి ఓటు వేయ‌మ‌ని ప్ర‌జ‌లు చెబుతుంటే పార్టీలో ఉన్న నాయ‌కులు మెల్ల‌గా పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. 2014 ఎన్నిక‌ల్లో గుంటురు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలు టీడీపీకి కంచుకోట‌గా ఉన్నాయి. ఇక ఎప్పుడైతే జ‌గ‌న్ త‌న పాద‌యాత్రలో భాగంగా ఈ జిల్లాలోకి అడుగు పెట్టారో ఒక జిల్లాను త‌ల‌ద‌న్నేలా మ‌రో జిల్లా ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.