చంద్రబాబుది మళ్ళి పాత కథే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-07-21 04:36:51

చంద్రబాబుది మళ్ళి పాత కథే

అవిశ్వాస తీర్మానంపై, అవిశ్వాస తీర్మానం సమయంలో మాట్లాడిన బీజేపీ నాయకులపై ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి స్పందించిన బాబు...ఈసారైనా కొత్త పల్లవి ఏదైనా అందుకున్నారా అంటే అదీ లేదు మళ్ళి పాత కథనే మీడియాకు వివరించారు చంద్రబాబు. 
 
1. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు 600 ...
 
చంద్రబాబు వాదన :
 
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 600 హామీలను నెరవేర్చి ఏపీని, రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నాం...
 
ప్రజల వాదన :
 
అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చింది కానీ... అధికారంలోకి వచ్చిన తర్వాత ఫించ‌న్ తప్ప ఇతర ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు...
 
2. ప్రపంచ దేశాల కంటే మెరుగైన రాజధానిని నిర్మిస్తా...
 
చంద్రబాబు వాదన :
 
అమరావతిని సింగపూర్, మలేసియా, చైనా, రష్యా, శ్రీలంక, స్విజర్లాండ్, లండన్ కంటే మెరుగైన ప్రపంచ రాజధానిని నిర్మిస్తున్నాం...
 
ప్రజల వాదన :
 
నాలుగేళ్లు గడిచిన అమరావతిలో భ్రమరావతి గ్రాఫిక్స్ తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు...
 
3. ప్రపంచపు రాజధాని కోసం 33 వేల ఎకరాల సేకరణ...
 
చంద్రబాబు వాదన :
 
రాజధాని కోసం దేశంలో ఎక్కడ 33 వేల ఎకరాల సేకరణ జరగలేదు...రాజధాని కోసం రైతులందరూ స్వచ్చందంగా భూములను ఇచ్చారు...
 
ప్రజల వాదన :
 
రాజధాని పేరుతో మూడు పంటలు పండే భూములను లాక్కొని అమరావతి రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారు... 
 
4. అధికారంలోకి రాకముందు " బాబు వస్తేనే జాబు వస్తుంది "
 
చంద్రబాబు వాదన :
 
మేము అధికారంలోకి వచ్చాక 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించాం...
 
ప్రజల వాదన :
 
బాబు వస్తేనే జాబు వస్తుంది అన్నారు ఇప్పుడు బాబు పోతేనే జాబు వస్తుంది...
 
5. అన్ని దేశాల నుండి మన రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు... 
 
చంద్రబాబు వాదన :
 
మన రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి..ఈ పెట్టుబడులతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం...
 
ప్రజల వాదన :
 
లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు కానీ...ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు..గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు...
 
6. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవిని...టీడీపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇప్పిస్తాం..
 
చంద్రబాబు వాదన :
 
ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమి లేదు...ప్రత్యేక హోదా  కంటే ఎక్కువగా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో వస్తుంది...
 
ప్రజల వాదన :
 
ప్రత్యేక హోదాను ఓటుకు నోటు కేసులో కేంద్రంలో తాకట్టు...
 
7. రాష్ట్రం బాగుపడాలంటే 30 ఏళ్ల అనుభవం ఉన్న బాబుకే ఓటేయండి...
 
చంద్రబాబు వాదన :
 
బాబు వలెనే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. బాబుకు ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని నెంబర్ వన్ దిశగా ముందుకు తీసుకువెళ్తున్నాడు...
 
ప్రజల వాదన :
 
బాబు వలన రాష్ట్రానికి కాదు...టీడీపీ నాయకులకు మంచి రోజులు వచ్చాయి...
 
8. దేశంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉంది 
 
చంద్రబాబు వాదన :
 
బాబు రోజుకి 36 గంటలు కష్టపడి...అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసాడు..
 
ప్రజల వాదన :
 
బాబు రోజుకి 36 గంటలు కష్టపడి...అభివృద్ధిలో  ఏమో కానీ... అవినీతిలో మాత్రం రాష్ట్రాన్ని నెంబర్ వ‌న్‌ స్థానంలో ఉంచాడు...
 
9.  పోలవరం బాబు కల...బాబు వస్తేనే పోలవరం పూర్తి...
 
చంద్రబాబు వాదన :
 
పోలవరం మా అధ్యక్షుని కల...అందుకే పోలవరాన్ని 2017 కాదు 2018 కాదు...  కాదు... 2019 లోపు పూర్తి చేస్తాం... 
 
ప్రజల వాదన :
 
పోలవరం మాత్రం నిజంగా నీ.. కలే...ఎందుకంటే కమీషన్ల కోసం... నీకు మాత్రం కలే...
 
10 . ఓటుకు నోటు కేసు...
 
చంద్రబాబు వాదన :
 
ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉన్న రాష్ట్రం కోసం అమరావతి నుంచి పరిపాలన చేసున్నాము...
 
 ప్రజల వాదన :
 
ఓటుకు నోటు కేసుకు బయపడి తట్ట బుట్ట సర్దుకొని కరకట్టకు పారిపోయారు...
 
11.  బాబు వస్తేనే మహిళలకు భద్రత
 
చంద్రబాబు వాదన :
 
మా పరిపాలనలో మహిళలకు పెద్ద పీట వేశాం...
 
ప్రజల వాదన :
 
మీరు నిజంగానే మహిళలకు పెద్ద పీట వేశారు...ఎలా అంటే మీ నాయకులు చేతే కించ పరిచే అంత...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.