టీడీపీని ఛి కొడుతున్నారు, జగన్ కి జేజేలు పడుతున్నారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-24 17:17:35

టీడీపీని ఛి కొడుతున్నారు, జగన్ కి జేజేలు పడుతున్నారు

ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అప్పుడు ఓదార్పు యాత్రతో, ఇప్పుడు ప్రజాసంకల్ప యాత్రతో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు...ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ముందుగానే గ్రహించిన ప్రతిపక్ష నేత నాలుగేళ్లు నుండి ఒకే స్టాండ్ తో ముందుకు వెళ్తున్నారు...
 
టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను వ్యతిరేకించినా, హోదా వల్ల కలిగే ఉపయోగాలను రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేయడానికి యువభేరీలు నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు, బంద్ లతో పాటు, నిరాహారదీక్షలు చేసి ప్రజలను చైతన్యవంతులను చేశారు జగన్. ప్రత్యేక హోదాకు తూట్లు పొడ‌వ‌డానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిని సజీవంగా ఉంచారు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి.. 
 
ఇలా ప్రతిపక్ష నేత పోరాట పటిమను, ఒక మాటకు కట్టుబడి ఉండండం, ప్రజలతో మమేకం అవ్వడాన్ని చూసి ప్రజలు జగన్ కి జేజేలు కొడుతున్నారు. మరో వైపు టీడీపీ ఎన్నికల ముందు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా తీసుకువస్తా అని తిరుపతి సభలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చారు బాబు. కానీ ఎన్నికల తర్వాత ఓటుకు నోటు కేసుకు బయపడి కేంద్రం కాళ్ళ దగ్గర ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు చంద్రబాబు...కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు అని మీటింగ్ పెట్టి ప్యాకెజీని ప్రకటిస్తే దానిని వ్యతిరేకించకుండా అర్థరాత్రి మీటింగ్ పెట్టి మరీ స్వాగతించారు చంద్రబాబు...
 
ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా..? ప్రత్యేహోదా వల్ల ఏమి ఓరుగదు, ఎవరైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కొట్టించడం, అడ్డుకోవడం, జైల్లో పెట్టిస్తానని భయపెట్టడం చేశారు చంద్రబాబు. ఇలా ప్రజలకు రోజుకో మాట చెప్తూ ప్రజలను అయోమయానికి గురిచేశారు చంద్రబాబు..ప్రతిపక్ష నేత పోరాట పటిమతో ప్రత్యేక హోదా ప్రజలోకి వెళ్లడం, ఎన్నికలకి సమయం దగ్గరపడుతుండడంతో బయపడి యూ- టర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంటున్నారు చంద్ర‌బాబు.
 
ఇలా బాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా..సొంత స్వప్రయోజనాల కోసం రోజుకో మాట మాట్లాతుండడంతో ప్రజలు విసిగిపోయారు. అదే కాకుండా టీడీపీ నాయకులు అవినీతిలో ముందుకు వెళ్లడం కూడా ప్రజలకు రుచించలేదు. రాష్ట్రంలో హత్యచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలతో ప్రజలు మండిపడుతున్నారు... వీటన్నింటిని గమనించిన తెలుగు ప్రజలు టీడీపీని ఛీ కొడుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.