జ‌గ‌న్ కు బాబుకు అదే తేడా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-06 17:34:03

జ‌గ‌న్ కు బాబుకు అదే తేడా

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకులో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నసంగ‌తి తెలిసిందే.
 
అయితే ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఎందుకు ఇంతలా నిరాజ‌నాలు ప‌లుకుతున్నారు! న‌ల‌భై సంవ‌త్స‌రాలు రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు కంటే న‌ల‌భై సంవ‌త్స‌రాలు ఉన్న జ‌గ‌న్ కుఎందుకు అంతలా ప్ర‌జలు ప్రేమాను రాగాలు చూపుతున్నారు!  వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన భారీ భ‌హిరంగ స‌భల‌కు ఎందుకు ల‌క్షలాదిమంది ప్ర‌జ‌లు హాజ‌రు అవుతున్నారు అలాంటి ప్ర‌శ్నలు ఇటు అధికార నాయ‌కుల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా పెద్ద ప్ర‌శ్నగా మారింది.
 
అయితే వీట‌న్నింటికి స‌మాధానం ఒక్క‌టే... జ‌గ‌న్ కు ఉన్న ఓర్పు, స‌హనం, ఎటువంటి వారితో అయిన క‌లిసి పోవ‌డం, ఆయ‌న చేయ‌బోయే ప‌ని మాత్ర‌మే చేస్తాన‌ని చెప్ప‌డం. ఈ నాలుగు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి న‌ర‌నారాల్లో ఇమిడి ఉన్నాయి. అందుకే జ‌గ‌న్ అంటే ప్ర‌జ‌లకు ఎన‌లేని అభిమానం, ప్రేమ‌.
 
ఆయ‌న త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో కూడా చిన్న‌వారిని త‌మ్ముడూ, అని పెద్ద‌వారిని అన్నా అంటూ ఎంతో ఆప్యాయంగా ప‌లుకరించ‌డం అది ఒక్క జ‌గ‌న్ వ‌ల్లే సాధ్యం అవుతోంది. అంతే కాదు రాయ‌లసీమ‌లో పాద‌యాత్ర చేస్తే సీమ యాస‌లో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకున్నారు.
 
ఇక ఇప్పుడు ఈ పాద‌యాత్ర కోస్తాంధ్ర‌లో కొసాగుతుండ‌డంతో భ‌హిరంగ స‌భ‌ల్లో అచ్చ‌మైన గోదావ‌రి యాస‌లో మాట్లాడుతూ ప్ర‌జ‌లు క‌ష్టాల‌ను తెలుసుకుంటున్నారు. ఇలా ప్రాంతాల‌ను బ‌ట్టి స్లాంగ్ మార్చి మాట్లాడ‌టం ఒక్క జ‌గ‌న్ వ‌ల్లే సాధ్యం అవుతోంది. ఇక ఏ రాజ‌కీయ నాయ‌కుడికి సాధ్యం కాదు. అందుకే ఈ విష‌యంలో జ‌గ‌న్ కు పెద్ద ప్ల‌స్ అవుతోందనే చెప్పాలి. 
 
అయితే ఇదే క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా భ‌హిరంగ స‌భ‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ స‌భ‌లో ముఖ్య‌మంత్రి స్పీచ్ వినేందుకు ప్ర‌జ‌లు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదని విశ్లేష‌కులు తెలుపుతున్నారు. ఎప్పుడో 1970 లో రాజ‌కీయ నాయ‌కులు టేప్ రికార్డు లాగా చెప్పిందే చెబుతూ స‌భ‌కు వ‌చ్చిన అర‌కొర‌ ప్ర‌జ‌ల‌కు కూడా విసుగు తెప్పిస్తున్నార‌ని అంటున్నారు. అందుకే టీడీపీకి వైసీపీ కి చాలా తేడా ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.