ప్ర‌తీ ఒక్క‌రు ఇలా ఆలోచిస్తే క‌చ్చితంగా జ‌గ‌న్ సీఎం అవుతారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan image 5
Updated:  2018-03-11 03:06:08

ప్ర‌తీ ఒక్క‌రు ఇలా ఆలోచిస్తే క‌చ్చితంగా జ‌గ‌న్ సీఎం అవుతారు

జగన్ ప్ర‌క‌టించిన‌ నవరత్నాల పథ‌కాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏదో విధంగా లబ్ది చేకూరుతోంద‌ని, చంద్రబాబు సుమారు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే... ప్రజలకు లబ్ది చేకూర్చే పథ‌కాలను ప్రవేశపెట్టలేదని, కేవలం జన్మభూమి కమిటీలే లబ్ది పొందాయని, అందుకే  2019 లో జగన్ కు ఓటువేయాలని, చంద్రబాబుకు ఓటు వేయకూడదు అంటూ సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం ఒక పోస్ట్ హల్ చల్ చేస్తుంది...
 
జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథ‌కాల ద్వారా ప్రతి ఇంటికి ఏదొ ఒక లబ్ది చేకూరుతోంది....అది ఎలా అంటే?
 
సాధారణంగా గ్రామాల్లో ప్రతీ ఇంటికి నలుగురు లేక ఆరుగురు కుటుం సభ్యులుంటారు....తాత,నాయనమ్మ,అమ్మ,నాన్న,ఒకరో,ఇద్దరో పిల్లలు ఉంటారు...
 
వృద్ధాప్యం పెన్షన్ ద్వారా ప్రతీ కుటుంబంలో ఒక్కరికి లేక‌ ఇద్దరికి నెలకు చెరొక 2000 రూపాయల చొప్పున 2000 నుండి 4000 రూపాయలు అందుతాయి...అదే కుటుంభంలో రైతు భరోసా పథ‌కం ద్వారా సంవత్సరానికి 12,500 రూపాయలు.... అంటే నెలకు 1,000 రూపాయల పైనే అందుతాయి...
 
ఇక అమ్మ ఒడి పథ‌కం కింద...బడికి వెళ్ళె పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున ప్రతీ కుటుంబంలో ఒక్కరికి లేక‌ ఇద్దరికి సుమారు 15,000 నుండి 30,000వేల‌ రూపాయలు అందుతాయి...అంటే నెలకు 1,250 నుండి 2,500 రూపాయలు అందుతాయి...
 
ఈ మూడు పథ‌కాల ద్వారానే ఒక సామాన్య కుటుంబానికి  నెలకు 2,000 లేక 4,000 + 1,000 + 1,250 లేక 2,500= 4,250 రూపాయల నుండి 7,500 రూపాయల వరకు లబ్ది చేకూరుతోంది.
 
1,000 రూపాయల ఖర్చు మించిన ఏ వ్యాధికైనా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుబాటులో ఉంటుంది...
 
అయితే చంద్రబాబు సుమారు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినా ప్రత్యేక్షంగా ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పథ‌కాన్ని ప్రవేశపెట్టలేక పోయారు...వచ్చే ఎన్నిక‌ల్లో కూడా ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్నో పథ‌కాలను టీడీపీ మేనిఫెస్టోలో చేర్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోన్న‌ట్లు తెలుస్తోంది...  దీంతో పాటు ప్ర‌తీ ఓటుకు 5000 రూపాయలు ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్నారు చంద్ర‌బాబు... 5 వేల‌ రూపాయలకి ఆశపడితే మరో 5 సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు...
 
బాబు ప్రజలని నమ్మరు మనం కూడా బాబుని నమ్మాల్సిన అవసరం లేదు..ఆయ‌న‌ పాలన 3 పర్యాయాలు చూశాం...మోదటి సారి వెన్నుపొటు, రెండవ సారి కరువు...మూడవసారి కూడా అవినీతి, దౌర్జన్యాలు...అందుకే జగన్ కి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం...అప్పుడు జగన్ కూడా బాబులా మాటమీద నిలబడకపొతే 2024లో ఓడిద్దాం అంటున్నారు నెటిజ‌న్లు...
 
ఇక జగన్ మీద ఉన్న అవినీతి కేసులంటారా...అవి గత 7 సంవత్సరాలగా విచారణ జరుగుతూనే ఉన్నాయి...ఆ కేసుల్లో చాలా వరకు కొట్టివేయబడ్డాయి...నిజంగా నిలబడే కేసులు అయితే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని న్యాయ వ్యవస్థను కూడా మభ్యపెట్టగల చంద్రబాబు, జగన్ ని బయట తిరగనిచ్చేవారా..? 
 
ఆలోచించండి....ఈ సారి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి...అంటూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.