ఇంత పిరికిత‌న‌మెందుకు...?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-18 12:41:43

ఇంత పిరికిత‌న‌మెందుకు...?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు అత్యంత‌రం ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతున్నాయి. కేంద్రంపై ఏపీలో అన్ని రాజ‌కీయ పార్టీలు యుద్దం ప్ర‌క‌టించాయి. ముఖ్యంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  పార్ల‌మెంట్ స‌భ్యులు  ఎప్రిల్ 6 న  రాజీనామా చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. 
 
ప్ర‌త్యేక హోదా సాధ‌నే ధ్యేయంగా  అన్ని రాజ‌కీయ పార్టీలు కేంద్రంపై గ‌ళ‌మెత్తాయి.  అయినా కూడా కేంద్ర ప్ర‌భుత్వం కనీసం చీమ కుట్టిన‌ట్లైనా  వ్య‌వ‌హారించ‌డం లేదు. ఇందుకు కార‌ణం మ‌న రాజ‌కీయ నాయ‌కులే అని  చెప్పాలి. అన్ని రాజ‌కీయ పార్టీల అంతిమ ల‌క్ష్యం ఒక్క‌టే అదే ప్ర‌త్యేక హోదా.
 
అలాంట‌పుడు అన్ని రాజ‌కీయ పార్టీలు ఏకం కాకుండా..... ఎవ‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వారు బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీని ప‌క్క‌కు పెట్టి రండి.... అంద‌రం క‌లిసి హోదా కోసం పోరాడ‌దాం....అంటూ ఇత‌ర పార్టీల‌కు ముఖ్యంగా టీడీపీకి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. 
 
నిజంగా టీడీపీతో పాటు ఇత‌ర పార్టీల‌కు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌పై  చిత్త‌శుద్ది ఉంటే వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు   అన్ని రాజ‌కీయ పార్టీలు క‌లిసి రావాలి. కాని, ఎవ‌రికి వారే య‌మునా తీరు అన్న‌ట్లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. ప్ర‌శ్నించేందుకు  రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన  జ‌న‌సేన కూడా జేఫ్ సీ అంటూ కొత్త నాట‌కానికి తెర‌లేపింది. 
 
మ‌రోవైపు వైకాపా రాజీనామాస్త్రంపై కూడా అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. హోదా కోసం రాజీనామా చేస్తామ‌ని చెప్పిన వైకాపా  ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో  నిర్ణ‌యం తీసుకోవ‌డం ద్వారా ఉప ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉండ‌ద‌నే ప్లాన్ తో ఉంద‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. 
 
ఇక మిగ‌తా పార్టీలు కూడా  2019 ఎన్నిక‌ల కోసం ప్ర‌జ‌ల్లో సింప‌తి కొట్టేసేందుకు ఇలా హోదా కోసం ఇప్పుడు ఉద్య‌మాన్ని ఉదృతం చేస్తున్నాయ‌నే చెప్పాలి. ఎవ‌రు ఎన్ని రాజ‌కీయ నాట‌కాలు వేసినా హోదా కోసం అంద‌రూ క‌లిసి పోరాడేందుకు ఎందుకంత పిరికితమో  నాయ‌కులే  స‌మాధానం చెప్పాలి. 
 
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.