రోడ్డు ప్ర‌మాదాల‌కు కేరాఫ్ డ్ర‌స్ గా మ‌రిన రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖుల లిస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

harikrishna road accident
Updated:  2018-08-30 11:57:17

రోడ్డు ప్ర‌మాదాల‌కు కేరాఫ్ డ్ర‌స్ గా మ‌రిన రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖుల లిస్ట్

రోడ్డు ప్రమాదాలు సామాన్యుల ఇళ్ల‌ల్లోనే కాకుండా ప్ర‌ముఖల‌ ఇళ్ల‌ల్లోను విషాదాన్ని నింపుతున్నాయి.  తాజాగా హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. రోడ్డు ప్ర‌మాదాల‌కు హ‌రికృష్ణ కుటుంబం కొద్ది కాలంగా కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది. నంద‌మూరి కుటుంబం ప్ర‌మాదాల‌ను ఒక్క‌సారి గ‌మ‌నించిన‌ట్లయితే గ‌త ప‌దేళ్లుగా వీరింట్లో సుమారు మూడు ప్ర‌మాదాలు జ‌రిగాయి.
 
2009 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌రికృష్ణ త‌యుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు. ఖ‌మ్మం జిల్లాలో ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొని తిరిగి వ‌స్తుండ‌గా న‌ల్గొండ జిల్లాలో కారు బోల్తా ప‌డింది. మోతే వద్ద జ‌రిగిన కారు ప్ర‌మాదంలో ఎన్టీఆర్ తోపాటు ఆయ‌న స్నేహితుల‌కు గాయాలు అయ్యాయి. ఆ త‌ర్వాత 2014లో ఇదే జిల్లా మున‌గాల మండ‌లం ఆకుపాముల‌వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ పెద్ద కుమారుడు జాన‌కి రామ్ దుర్మ‌ర‌ణం చెందారు. 2014 డిసెంబ‌ర్ 6న హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వెళ్తుండ‌గా ట్రాక్ట‌ర్ ను త‌ప్పించే క్ర‌మంలో కారు అదుపు త‌ప్ప‌డంతో జాన‌కి రామ్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. జాన‌కిరామ్ మృతి అప్ప‌ట్లో హ‌రికృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
 
ఇక ఈ విషాదం నుంచి కోలుకోవ‌డానికి హ‌రికృష్ణ‌కు చాల‌కాలం ప‌ట్టింది. అప్ప‌టినుంచి నంద‌మూరి చిత్రాల ప్రారంభానికి ముందు రోడ్డు ప్ర‌మాదాల‌పై అప్ర‌మ‌త్తం చేస్తూ ప్ర‌చారం చేస్తూ వ‌స్తున్నారు. అతివేగం ప్ర‌మాద‌క‌రం యాక్సిడెంట్ వ‌ల్ల మేము ఇప్ప‌టికే మా ప్రియ సోద‌రుడిని కోల్పోయాము ఆ ప‌రిస్తితి మ‌రెవ్వ‌రికి రావ‌ద్దు అనే మాట‌లు అందులో వినిపిస్తాయి. జాన‌కి రామ్ మృతి ఆ కుటుంబంలో ఎంత విషాదం నింపిందో చెప్పేందుకు వారి మాట‌లే స‌జీవ సాక్ష్యం. ఇక ఈ ప్ర‌మాదం హ‌రికృష్ణ కుటుంబం ఇంకా కోలుకోక‌ముందే మ‌రో పెను విషాదం చోటు చేసుకుంది. న‌ల్గొండ జిల్లా అన్నెప‌ర్తిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ దుర్మ‌ర‌ణం పాలు అయ్యారు. నెల్లూరులో ఓ వివాహ‌నికి హాజ‌రు అయ్యేందుకు వెళ్తున్న హ‌రికృష్ణ స్వ‌యంగా తానే వాహ‌నం న‌డిపారు. 
 
అతివేగంగా దూసుకు వెళ్లిన వాహ‌నం ముందువెళ్తున్న వాహ‌నాన్ని ఢీ కొట్టి ప‌క్క‌కు ప‌డిపోయింది. దీంతో హ‌రికృష్ణ కారులో నుంచి సుమారు 30 అడుగుల‌ దూరంలో ప‌డిపోయారు. వెంట‌నే స్థానికులు అప్ర‌మ‌త్త‌మై ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. వాహ‌నాలు న‌డ‌ప‌డంలో హ‌రికృష్ణ‌కు సుదీర్ఘ‌మైన అనుభ‌వం ఉంది. ద‌శాబ్దాలుగా ఏ వాహ‌నం ఎక్కినా ఆయ‌నే డ్రైవ‌ర్, రాజ‌కీయంలోకి వ‌చ్చిన కొత్త‌లో ఎన్టీఆర్‌ ప్ర‌చారానికి వినియోగించిన చైత‌న్య ర‌థ‌సార‌ధికి కూడా హ‌రికృష్ణ‌నే. అలాంటి వ్య‌క్తి రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ణంపాలు అవ్వ‌డం నంద‌మూరి అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచింది.
 
హ‌రికృష్ణ కుటుంబ‌మే కాదు ప‌లువురు చాలామంది ప్ర‌ముఖుల కుటుంబాల్లో రోడ్డు ప్ర‌మాదాలు విషాదాల‌ను నింపాయి. గ‌త రెండు ద‌శాబ్దాల్లో ప‌లువురు ప్ర‌ముఖులు వారి కుటుంబ స‌భ్యులు రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించారు. 1999లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఓ వివాహానికి హ‌జ‌రై తిరిగి వ‌స్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మాజీ మంత్రి పీ ఇంద్రా రెడ్డి దుర్మ‌ర‌ణం చెందారు. 
 
ఇక 2012లో టీడీపీ సీనియ‌ర్ నేత కేంద్ర మంత్రి ఎర్ర‌న్నాయుడు కూడా రోడ్డు ప్ర‌మాదానికి గురి అయ్యారు. ఆ త‌ర్వాత 2013లో మాజీ ఎంపీ లాల్ జాన్ భాష రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాల‌ను కోల్పోయారు. ఇక 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో తిరిగి వ‌స్తుండ‌గా క‌ర్నూల్ జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో వైసీపీ నాయ‌కురాలు శోభానాగిరెడ్డి దుర్మ‌ర‌ణం పాలు అయ్యారు. ఈ ప్ర‌మాదాల‌న్నంటికి మితిమీరిన అతివేగ‌మే కార‌ణం.
 
తాజాగా హ‌రికృష్ణ మృతికి కూడా అదే కార‌ణం అని తెలుస్తోంది. రాజ‌కీయ నాయ‌కులే కాదు సినీ ప్ర‌ముఖులు కూడా రోడ్డు ప్ర‌మాదంలో మ‌రణించారు. సినీ హాస్య‌న‌టుడు బాబు మూహ‌న్ కుమారుడు ప‌వ‌న్ కుమార్, అలాగే కోట శ్రీనివాస్ త‌న‌యుడు కోట ప్ర‌సాద్ కూడా రోడ్డు ప్ర‌మాదంలోనే చ‌నిపోయాడు. ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి త‌న‌యుడు ప్ర‌తీక్ రెడ్డి, మ‌రో ఎమ్మెల్యే నారాయ‌ణ కుమారుడు నిషిత్ కూడా రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాలు అయ్యాడు, అలాగే నటుడు ర‌వితేజ సోద‌రుడు కూడా రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.