వైసీపీకి ఒక‌టి టీడీపీకి రెండు ఏక‌గ్రీవం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp tdp
Updated:  2018-03-13 03:44:22

వైసీపీకి ఒక‌టి టీడీపీకి రెండు ఏక‌గ్రీవం

ఏపీలో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల జాత‌ర జ‌రుగుతోంది... మొత్తానికి వైసీపీకి ఒక్క‌సీటు కూడా రాకుండా చేద్దాము అనుకున్న తెలుగుదేశం, ఓ స్టెప్ వెన‌క్కి వేసింది అనే చెప్పాలి... వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి స‌తీమ‌ణి త‌న నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకున్న నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది.
నామినేష‌న్ దాఖ‌లు చేసిని ముగ్గురి అభ్య‌ర్ధుల ఎన్నిక ఏక‌గ్రీవం అయింది.
 
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీకి చెందిన సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు... ఇక దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఈ నెల 15 న వెల్ల‌డించే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది. వైసీపీ త‌ర‌పున నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఆయ‌న భార్య  ప్రశాంతిరెడ్డి కూడా అనుబంధంగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.
 
నేడుప్ర‌శాంతిరెడ్డి త‌న నామినేష‌న్  ఉప‌సంహ‌రించుకున్నారు..దీంతో పోటికి ఎవ‌రూ లేక‌పోవ‌డంతో వారి ముగ్గురి అభ్య‌ర్దిత్వం ఫైన‌ల్ అయింది...  మొత్తానికి తెలుగుదేశం త‌ర‌పున వ‌ర్ల రామ‌య్య‌కు సీటు వ‌స్తుంది అని అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన బీద మ‌స్తాన్ రావుకు  కూడా అవ‌కాశం ఉంది అని లీకులిచ్చారు... కాని చివ‌ర‌కు వారి ఇరువురికి కాకుండా సీఎం ర‌మేష్ కు మ‌రో అవ‌కాశం ఇచ్చారు.. అలాగే  క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ కు బాబు అవ‌కాశం ఇచ్చారు.. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.