హోదా కోసం మ‌రో ప్రాణం బ‌లి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

special status
Updated:  2018-08-20 04:47:49

హోదా కోసం మ‌రో ప్రాణం బ‌లి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు అమ‌ర సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నా సంగ‌తి తెలిసిందే. ఈ నిర‌స‌న‌లు కాస్త మ‌రింత ఉద్రిక్తం కావ‌డంతో సాధార‌ణ ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా సూసైడ్ చేసుకుని మ‌రీ చ‌నిపోతున్నారు. 
 
అయితే ఇదే క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా సాధ‌ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లా మ‌ధ‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ యువ‌కుడు సూసైడ్ లేఖ రాసి చ‌నిపోయాడు. ఇక ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే ప్ర‌త్యేక హోదా కోసం మ‌రో నిండు ప్రాణం బ‌లైపోయింది. హోదా సాధ‌న కోసం ఓ వ్య‌క్తి పురుగుల‌మందు తాగి మ‌ర‌ణించిన ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలో ఆల‌స్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..క‌డ‌ప జిల్లా రాజంపేట చెందిన  పైడికొండల యానాదయ్య అనే వ్య‌క్తి భ్ర‌తుకు దెరువు రిత్య సుమారు ప‌ది సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌కాశం జిల్లాకు వ‌ల‌స వ‌చ్చాడు. 
 
పైడికొండల యానాదయ్యకు భార్య ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. ప్ర‌కాశం జిల్లాలో ఓ సిమెంట్ షాప్ లో గుమ‌స్తాగా ప‌నిచేస్తూ త‌న కుటుంబాన్ని పోసిస్తూ ఉండేవారు. గతంలో స‌మైఖ్యంధ్రా ఉద్య‌మంలో కూడా చురుకుగాపాల్గొనే వారు పైడికొండల యానాదయ్య. ప్ర‌స్తుతం రాష్ట్రానికి సంజీవ‌ని అయిన‌ ప్ర‌త్యేక హోదా పోరాటంలో కూడా పైడికొండల యానాదయ్య త‌రుచు పాల్గొనేవారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ పై చూపిస్తున్న వైఖ‌రికి వ్య‌తిరేకంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి లేఖ‌ను రాసి పురుగుల మందుతాగి మ‌రణించారు. 
 
ఈ లేఖ‌లో యానాదయ్య ఏమ‌ని పేర్కొన్నారు అంటే నాకు జ‌రిగిన అన్యాయం నా పిల్ల‌ల‌కు జ‌రుగ‌కూడ‌ద‌ని అందుకే తాను చ‌నిపోతున్నాన‌ని పేర్కొన్నారు. నా ఆత్మ‌హ‌త్య‌తో అయినా రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ నాయ‌కులు హోదాకోసం పోరాడుతార‌ని, కేంద్ర ప్ర‌భుత్వాం దిగివ‌స్తుంద‌ని అశిస్తూ సెల‌వు అని రాశాడు... త‌న కుటుంబాన్ని ఒంగోలు ఎమ్మెల్యే జ‌నార్థ‌న్ రెడ్డి ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇక ఈ లేఖ‌ను పోలీసులు స్వాదినం చేసుకుని కేసున‌మోదు చేసుకున్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.