Breaking News

హోమ్        న్యూస్


బీజేపీకి షాక్ ఇచ్చిన ఏపీ యూత్‌

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీవ్ర అన్యాయం జ‌రిగిన విష‌యం అంద‌రికి తెలిసిందే.  దీనిపై  నేరుగా    కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల్సి ఉన్నా..  రాజ‌కీయ నాయ‌కులు  మాత్రం  సందిగ్దంలో ఉన్నారు.  అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తే రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఎక్క‌డ విఘాతం క‌లిగిస్తారో అన్న భ‌యం  వాళ్ల‌లో ఉంది.
 
కేంద్రం చేసిన అన్యాయాన్ని ఏపీ యువ‌కులు త‌మ‌దైన శైలిలో బీజేపీ ప్ర‌భుత్వానికి  తెలియ‌జేస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్రమోడి అధికారంలోకి రావ‌డానికి ఉప‌యోగించిన సొష‌ల్ మీడియా విధానాన్ని...అవ‌కాశంగా  తీసుకున్న ఏపీ యువ‌కులు సొష‌ల్ మీడియా ద్వారానే కేంద్ర ప్ర‌భుత్వం పై త‌న‌ అక్క‌సును వెల్ల‌గ‌క్కుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్య‌క‌ హోదా, విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాలు  నిర‌స‌న తెలుపుతున్నారు.
 
బీజేపీ కి చెందిన ఫేస్‌బుక్‌ పేజీ  రేటింగ్ ను త‌గ్గించి వారి వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేశారు ఏపీ యువ‌కులు. దీంతో పేజీ రేటింగ్‌ ఒక్కసారిగా 1.1కి పడిపోయింది.  గతంలో 17వేల మందికి పైగా 5స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు.  ప్ర‌ధాని మోడికి తెలిసే విధంగా యువత, నెట్‌జన్లు ట్రెండింగ్‌ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక హాష్‌ ట్యాగ్‌లను రూపొందించి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు పెడుతున్నారు.

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.