ఫిరాయింపు ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన ప్ర‌జలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp flag
Updated:  2018-09-18 03:34:39

ఫిరాయింపు ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన ప్ర‌జలు

విశాఖ జిల్లా ఎస్టీ రిజ‌ర్వుడు అయిన నియోజ‌క‌వ‌ర్గం అర‌కు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టి నుంచి తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి ప‌ట్టు ఉంది. ఇక నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2009లో జ‌రిగిన హోరిహోరీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిపై టీడీపీ నాయ‌కుడు సివేరి సోమా స్వ‌ల్ప ఓట్ల తేడాతో గెలిచారు. ఇక 2014లో ఎన్నిక‌ల్లో వైఎస్ అభిమానం, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీద ప్రేమ‌తో వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు గెలిచారు. 
 
ఆ త‌ర్వాత టీడీపీ ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ఆయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. తాను టీడీపీలో చేరి గిరిజ‌నుల జీవితాల్లో వెలుగు నింపుతాన‌ని చెప్పి టీడీపీ తీర్థం తీసుకున్నఆయ‌న ఇంత‌వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం కూడా చెయ్య‌లేద‌నే ప్రధాన ఆరోప‌ణ‌. గిరిజ‌న ప్రాంతాల‌కు ఐటీడీఏ ద్వారా కోట్ల రూపాయ‌లు నిధులు వ‌స్తున్నా, గిరిజ‌నులు ప‌రిస్థితిలో మార్పులేదు.
 
అంతేకాదు హౌసింగ్ వంటి స్కీంలో కూడా అధికార పార్టీనాయ‌కుల‌కు క‌ట్ట‌బెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు మూట గ‌ట్టుకున్నారు. దీంతోపాటు ఎమ్మెల్యే హామీలు నెర‌వేర‌లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా తీవ్ర‌స్థాయిలో ఉన్నాయి. పెద‌బ‌య‌లు, ముంచంగిపుట్టు మండ‌లాల్లో అనేక గ్రామాలు పొరుగునే ఉన్న ఒడిశా గ్రామాల‌తో సంబంధాలు క‌లిగి ఉంటాయి. ప్ర‌మాద‌క‌ర కాలువ‌ల‌ను నాటుప‌డ‌వ‌ల‌తో దాటే ప్ర‌య‌త్నంలో అనేక మంది ప్రాణాలు కొల్పోతున్నారు. 
 
అలాగే సీజిన‌ల్ వ్యాధులు, విష‌జ్వ‌రాలు అర‌కు లోయ‌లోనే ఎక్క‌వ‌. అయితే వీటిపై గిరిజ‌న గ్రామాల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌టంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫ‌లం అయ్యారు. రాజ‌కీయంగా అర‌కులో టీడీపీ పెంద‌గా ఫాలోయింగ్ లేదు. గ‌తంలో ఆధికార ప్ర‌లోభాలకు లొంగిపోయి కిడారి టీడీపీ తీర్థం తీసుకున్నా త‌న క్యాడ‌ర్ మాత్రం అలాగే ఉంది.  వైసీపీకి గ‌ట్టి ప‌ట్టు ఉన్న అర‌కులో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జలు వైసీపీ తర‌పున ఎలాంటి నాయ‌కుడుని అయినా భ‌రిలోకి దించినా ఆయ‌న‌ను అత్య‌ధిక మెజార్టీతో గెలిపించేందుకు అర‌కు ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.