మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే మృతి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-23 02:50:43

మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే మృతి

విశాఖ జిల్లాలో మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కిడారితోపాటు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ మృతి చెందారు. కిడారిని కిడ్నాప్ చేస్తామని పలుమార్లు హెచ్చరించారు మావోయిస్టులు. 

ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఒక్కసారిగా మావోయిస్టులు ఎమ్మెల్యే పై కాల్పులు జరపడంతో అంతా షాక్ కు గురయ్యారు. 2014 లో వైసీపి నుంచి కిడారి అరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన టిడిపిలో చేరారు. కాగా ఈరోజు అరకు ఎమెల్య క్వార్టర్స్ నుండి వస్తుండగా డుంబ్రి మండలం, లిప్పట్టి పుట్ట రహదారి వద్ద మావోయిస్టులు వీరిపై దాడి జరిపారు.

ఈ కాల్పుల్లో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నారు. కిడారిని, శివేరి సోముని మినహాయించి మిగిలిన వారిని వాహనాల్లో నుండి దింపేశారు. ఆ తర్వాత గన్ మెన్ లను తమ ఆయుధాలను కింద పడేయాల్సిందిగా హెచ్చరించిన మావోయిస్టులు అతి సమీపం నుండి ఇరువురిని కాల్చి చంపేసినట్టు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.