అఖిల ప్రియ v/s సుబ్బా రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 11:13:50

అఖిల ప్రియ v/s సుబ్బా రెడ్డి

ఎన్నో సంవత్సరాల నుండి కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసించింది భూమా ఫ్యామిలీ...భూమా నాగి రెడ్డి, శోభా నాగిరెడ్డి అకాల మరణం తర్వాత నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయాలలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది...ముఖ్యంగా భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు సుబ్బా రెడ్డి, అఖిల ప్రియ మధ్య పోరు తీవ్ర స్థాయిలో వీళ్లిద్దరి మధ్య విభేదాలను తగ్గించడానికి చంద్రబాబు ప్రయత్నం చేసిన అది బెడిసికొడుతూనే ఉంది.
 
చంద్రబాబు పిలిచి మాట్లాడిన తర్వాత కొద్దీ రోజులకే ఎదో ఒక రూపంలో సుబ్బా రెడ్డి, అఖిల ప్రియ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి...ఇంతకు ముందు కూడా భూమా వర్థంతికి తనని పిలవలేదని సుబ్బా రెడ్డి అఖిల ప్రియపై ఆగ్రహం వ్యక్తం చేసారు. భూమా అఖిల ప్రియ నాకు సరైన గౌరవం ఇవ్వడంలేదని, మా మధ్య విభేదాలు నిజమేనని మీడియా ముఖంగా చెప్పారు సుబ్బా రెడ్డి.. అప్పుడు సుబ్బా రెడ్డి తన అనుచరులతో చర్చించి పార్టీ మారుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
 
ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి మధ్య పోరు మొదలైంది.. టీడీపీ సీనియర్ నేత సుబ్బా రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసారు...ప్రత్యేక హోదా కోసం టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో సైకిల్ ర్యాలీ చేస్తుంది...దీనిలో భాగంగా సుబ్బా రెడ్డి ఆళ్లగడ్డలో సైకిల్ యాత్ర చేస్తున్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసారు...ఈ ఘటనపై సుబ్బా రెడ్డి మాట్లాడుతూ ఈ దాడి చేపించింది అఖిల ప్రియ అని అనుమానం వ్యక్తం చేసారు...భూమా అఖిల ప్రియ కావాలనే ఇలాంటి దాడులు చేపిస్తుందని చెప్పారు... ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేసారు సుబ్బా రెడ్డి... ఈ ఘటనతో వీళ్లిద్దరి మధ్య పోరు మళ్ళి మొదలైంది...దింతో సుబ్బా రెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఆళ్లగడ్డ నాయకులు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.